Share News

మేమూ బాధితులమే

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:37 AM

‘డాయ్‌ యాప్‌’ మోసంలో తామూ బాధితులమేనని పలువురు ఆర్పీలు తెలిపారు.

మేమూ బాధితులమే
రెండో రోజూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు

పలమనేరు, జూలై 30: ‘డాయ్‌ యాప్‌’ మోసంలో తామూ బాధితులమేనని పలువురు ఆర్పీలు తెలిపారు. తొలిరోజు నుంచీ కొందరు తమపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. పలమనేరులోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కొందరు ఆర్పీలు తమ ఆవేదన వ్యక్తంచేశారు. తమతో పాటు దశాబ్దకాలంగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజేష్‌, సీవో జయంతి ఒత్తిడి వల్ల తామూ డాయ్‌యా్‌పలో పెట్టుబడి పెట్టామన్నారు. ‘నాకు సెల్‌ఫోనులో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం తెలియదు. దీంతో రాజేష్‌ నా ఫోను తీసుకొని ఆయనే డాయ్‌యా్‌పలో నన్ను చేర్పించారు’ అని ఒక ఆర్పీ పేర్కొన్నారు. తాము చెప్పినంతం మాత్రాన పలువురు డాయ్‌యా్‌పలో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని చెప్పడం దారుణమని ఇంకొందరు ఆర్పీలు తెలిపారు. 15వేలు కట్టిన వాళ్లు కూడా తాము లక్షలాది రూపాయలు ఆర్పీలను నమ్మి కట్టామని చెబుతున్నారని, వీరంతా గ్రూపుల్లో తీసుకొన్న రుణాలను ఎగవేసేందుకే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు తమపై చేస్తున్నారని పేర్కొన్నారు. తాము వితంతువులమని, తమ పిల్లలను చదివించుకొనేందుకు డాయ్‌యా్‌పలో డబ్బులు వస్తుందని రాజేష్‌ చెప్పడంతో ఆశపడి తామూ డబ్బులు కట్టామన్నారు. అంతేగానీ ఎవరినీ బలవంతం చేసి డబ్బులు కట్టించలేదన్నారు. ఈ యాప్‌లో ఒక గొలుసులాగా ఒకరు కడితే సభ్యులుగా మారిన వారు మరో పదిమందిచేత కట్టించుకు పోతారని అందరికి తాము ఎలా బాధ్యత వహిస్తామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తే తాము ఏమేరకు నష్టపోయామో తెలుస్తుందన్నారు. రాజేష్‌, సీవో జయంతి మాటలు నమ్మి తాము మోసపోయామన్నారు. ఇప్పుడు రాజేష్‌ అడ్ర్‌సలేకుండా పోయాడని, తమను ఇలా వీధుల్లో వేశాడని శాపాలు పెట్టారు. ఈ డాయ్‌ యాప్‌లో తమనూ బాధితులుగా గుర్తించాలని ఆర్పీలు తెలిపారు.

రెండో రోజు 149 మంది ఫిర్యాదు

రెండో రోజైన మంగళవారం డాయ్‌యాప్‌ బాధితుల నుంచి సీఐ చంద్రశేఖర్‌, మెప్మా పీడీ రాధమ్మ ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం 224 మంది రూ. 4.06 కోట్లమేర నష్టపోయినట్టు ఫిర్యాదు చేయగా మంగళవారం 149 మంది రూ.1.99 కోట్ల మేర డాయ్‌యా్‌పలో నష్టపోయినట్లు ఫిర్యాదులు చేశారు. మొత్తం రెండురోజులు మున్సిపల్‌ కార్యాలయంలో 363 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. వీటిపై నివేదిక తయారు చేసి కలెక్టరుకు పంపనున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 31 , 2024 | 02:37 AM