Share News

Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:45 PM

ఖాన్‌తో గేమ్స్ ఆడితే శాల్తీలు గల్లంతవుతాయే లేదో. కానీ.. పాముతో గేమ్స్ ఆడితే మాత్రం శాల్తీలు గల్లంతయ్యే పరిస్థితి తప్పదన్న సంగతి అందరికీ తెలిసిందే.

Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!

ఖాన్‌తో గేమ్స్ ఆడితే శాల్తీలు గల్లంతవుతాయే లేదో. కానీ.. పాముతో గేమ్స్ ఆడితే మాత్రం శాల్తీలు గల్లంతయ్యే పరిస్థితి తప్పదన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే నిజ జీవితంలో పాము కనిపిస్తే చాలు.. పాము.. పాము అంటూ చిన్న పెద్దా.. అంతా ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు అయితే.. ఆ పాము అంతు చూసే దాకా నిద్రపోరు. అయితే ఓ మందుబాబు మాత్రం పాము కనిపిస్తే.. దానితో ఆటలాడాడు. ఆ క్రమంలో అతడిని పాము పలుమార్లు కాటేసింది.

Also Read: Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త కార్యాలయం


మద్యం కిక్కులో ఆ విషయాన్ని అతడు గమనించ లేదు. కానీ పాము కాటుతో అతడు ఆసుపత్రి పాలైయ్యాడు. ఈ ఘటన బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక కాలేజీలోకి పాము ప్రవేశించింది. అనంతరం పొదల్లోకి జరజర పాక్కుంటూ వెళ్లి పోయింది.

Also Read: Maharastra: ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ


ఆ విషయాన్ని బాగా తాగి ఉన్న నాగరాజు గమనించాడు. దాంతో పొదల్లోనున్న పామును రహదారిపైకి తీసుకు వచ్చాడు. అనంతరం ఆ పాముతో ఆడడం ప్రారంభించాడు. ఆ క్రమంలో నాగరాజు చేతిపైన, కాళ్లపైన పాము పలుమార్లు కాటు వేసింది. అయితే ఆ విషయాన్ని అతడు గమనించే పరిస్థితిలో మాత్రం లేడు.

Also Read: AP Assembly: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు


దాంతో స్థానికులు వెంటనే స్పందించి.. అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ నాగరాజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం తెలియరాలేదు. అయితే పాముతో నాగరాజు గేమ్స్ ఆడటాన్ని స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 04:48 PM