Share News

dwma ఎట్టకేలకు రిలీవ్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:32 PM

ఎట్టకేలకు డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి రిలీవ్‌ అయ్యారు. ఈనెల 12న డ్వామా పీడీగా ఉన్న వేణుగోపాల్‌రెడ్డిని మాతృశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈనెల 17 వరకు అవకాశం కల్పించాలని, ఆరోజు రిలీవ్‌ అవుతానని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ నుంచి వేణుగోపాల్‌ రెడ్డి అనుమతి తీసుకున్నారు.

dwma ఎట్టకేలకు రిలీవ్‌
డ్వామా కార్యాలయం

డ్వామా పీడీ బాధ్యతల నుంచి తప్పుకున్న వేణుగోపాల్‌ రెడ్డి

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 16: ఎట్టకేలకు డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి రిలీవ్‌ అయ్యారు. ఈనెల 12న డ్వామా పీడీగా ఉన్న వేణుగోపాల్‌రెడ్డిని మాతృశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈనెల 17 వరకు అవకాశం కల్పించాలని, ఆరోజు రిలీవ్‌ అవుతానని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ నుంచి వేణుగోపాల్‌ రెడ్డి అనుమతి తీసుకున్నారు. అయితే ఆయనపైన సోషల్‌ మీడియాలో విపరీత మైన ఆరోపణలతో పోస్టులు పెట్టడంతో సోమవారం హుటా హుటిన రిలీవ్‌ అయ్యారు. వేణుగోపాల్‌రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలకాలని కొందరు స్వామి భక్తులు యత్నించగా, ఆవిషయం బయటకు పొక్కడంతో వీడ్కోలు సభను రద్దు చేసినట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి సుమారు రూ.15లక్షల వరకు డబ్బులు వసూ లు చేసి పీడీకి బంగారు కడియం తొడగాలని యత్నించినట్లు సమాచారం. ఈ విషయాలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో వీడ్కోలు సభ నిర్వహించకూడదని భావించారు. రిలీ్‌ అయిన వెంటనే వేణుగోపాల్‌రెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లినట్లు ఆశాఖలోని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఇనచార్జి బాధ్యతలు ఎవరికీ అప్పగించకపోవడం సర్వత్రా ఉత్కంఠగా మారింది. అందరూ ఏపీడీగా ఉన్న సుధాకర్‌రెడ్డికి డ్వామా ఇనచార్జి పీడీగా బాధ్యతలు అప్పగిస్తారని చర్చించుకుంటున్నారు.

పోటీలో ఇద్దరు

డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి రిలీవ్‌ కావడంతో ఇనచార్జి పీడీ పోస్టుకు ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. డ్వామాలో ఉపాధి పథకం సూపరిండెంట్‌గా పనిచేస్తున్న ఎంపీడీఓ శైలజ, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా పనిచేస్తున్న రామాంజనేయులు ఇనచార్జి బాధ్యతల కోసం ముమ్మర ప్రయత్నాల్లో నిమగ్నమ య్యారు. డ్వామా ఏపీడీగా ఉన్న సుధాకర్‌ రెడ్డికి కాకుండా ఇతరులకు ఇస్తారా...లేక ఆయనకే ఇనచార్జి బాధ్యతలు అప్పగి స్తారా అనేది కలెక్టర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Updated Date - Sep 16 , 2024 | 11:33 PM