బాలలపై లైంగిక వేధింపులను వ్యతిరేకించాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:24 AM
కార్పొరేషన్(కాకినాడ), నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): సమాజంలో ప్రతీ ఒక్కరూ బాలలపై లైంగిక వేధింపులను వ్యతిరేకించాలని రాష్ట్ర బా లల హక్కుల కమిషన్ సభ్యురాలు పి.ఆదిలక్ష్మి అన్నారు. బాలలపై లైంగిక వేధింపుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ పీడీ కొండా ప్రవీ
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పి.ఆదిలక్ష్మి
కార్పొరేషన్(కాకినాడ), నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): సమాజంలో ప్రతీ ఒక్కరూ బాలలపై లైంగిక వేధింపులను వ్యతిరేకించాలని రాష్ట్ర బా లల హక్కుల కమిషన్ సభ్యురాలు పి.ఆదిలక్ష్మి అన్నారు. బాలలపై లైంగిక వేధింపుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ పీడీ కొండా ప్రవీణ ఆధ్వర్యం లో పోలీస్ డిపార్టుమెంట్, సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్టు, సెంటర్ ఫర్ వరల్డ్ సోలిడారిటీ మరిన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో 600 మంది విద్యార్థులతో మంగళవారం కాకినా డ మసీదు సెంటర్ నుంచి గవర్నమెంట్ ఆసుపత్రి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ముఖ్యఅతిథిగా పి.ఆదిలక్ష్మి హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి మా ట్లాడుతూ ఎక్కడైనా బాలలను వేధింపులకు గు రిచేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే 1098, 112 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. పీడీ ప్రవీణ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా సమాజంలో బాలల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, చిన్నారి రక్షణ, కిషోరి వికాసో వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారి పరిరక్షణకు ఎంతో కృషి చేస్తుం దన్నారు. జిల్లా బాలల పరిరక్షణాధికారి సీహెచ్ వెంకటరావు, చైల్డ్‌లైఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
బాలల భవిష్యత్తుకు భరోసా
సర్పవరం జంక్షన్, నవంబరు 19 (ఆంధ్ర జ్యోతి): బాలల బంగారు భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పి.ఆదిలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ అన్నారు. రమణయ్యపేట మండల పరిషత్ కార్యాలయం లో ట్రైనింగ్ కలెక్టర్ భావన, ప్రవీణ ఆధ్వర్యంలో బాలల హక్కులపై నూరుశాతం ఛైల్డ్ సేప్టీ ఓరి యంటేషన్ జిల్లాస్థాయి సమావేశం ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందికి అవగాహన నిర్వహించా రు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, సీడీపీవోలున్నారు.