మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Nov 02 , 2024 | 12:22 AM
సర్పవరం జంక్షన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మహిళాభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలన అందిస్తున్నట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శుక్రవారం రమణయ్యపేట
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ
సర్పవరం జంక్షన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మహిళాభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలన అందిస్తున్నట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శుక్రవారం రమణయ్యపేట మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన దీపం-2 పథకంలో భాగంగా మహిళా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస బాబాతో కలిసి పంపిణీ చేశారు. నానాజీ మాట్లాడుతూ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా మహిళలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ కుమారి, ఎంపీడీవోలు పసుపులేటి శ్రీనివాస్, మట్టపర్తి అనుపమ, ఎంఎస్‌వో మమత, కూటమి నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, తాటికాయల వీరబాబు, పుల్ల శ్రీరాములు పాల్గొన్నారు.