Share News

భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు జీవనభృతి ఇవ్వాలి

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:11 AM

ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10వేలు జీవన భృతి కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్‌ డిమాండు చేశారు.

భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు జీవనభృతి ఇవ్వాలి

మేషన్‌ అండ్‌ కార్పెంటర్స్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ సమావేశం

ముమ్మిడివరం, సెప్టెంబరు 2: ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10వేలు జీవన భృతి కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్‌ డిమాండు చేశారు. ముమ్మిడివరంలో సోమవారం గంజా సత్తిబాబు అధ్యక్షతన జరిగిన ముమ్మిడివరం ఏరియా మేషన్‌ అండ్‌ కార్పెంటర్స్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో దుర్గాప్రసాద్‌, యూనియన్‌ కార్యదర్శి కముజు సత్తిబాబు మాట్లాడారు. సమావేశంలో రెడ్డి వలియాబాబా, పేరూరి రామకృష్ణ, మట్టపర్తి నాగేశ్వరరావు, మట్టపర్తి బాలాజీ పాల్గొన్నారు

Updated Date - Sep 03 , 2024 | 12:11 AM