Share News

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:22 AM

పెద్దాపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంధ సంస్థలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మకా

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
పెద్దాపురం మండలం ఆర్‌బీ కొత్తూరులో కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న చినరాజప్ప

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

పెద్దాపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంధ సంస్థలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని ఆర్‌బీ కొత్తూరు గ్రామం లో శ్రీ కిరణ్‌ కంటి ఆసుపత్రి పర్యవేక్షలో ఏర్పా టుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గాలి బంగ్లాలో చేనేత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధనకు హాజరయ్యారు. సబ్బినీడి హరిబాబు, సోమనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి

సామర్లకోట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవడం ద్వారా సమాజంలో మంచికార్యక్రమాలకు సహ కరించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కనకదుర్గ ఆలయ నిర్మాణ పను లకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముమ్మిడి సూరిబాబు, ముమ్మిడి వెంకటేశ్వర రావు, పోతులు శ్రీనివాస సత్యనారాయణ పిన్ని ంటి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:22 AM