Share News

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Aug 29 , 2024 | 01:16 AM

పారిశుధ్య, తాగునీరు అవసరాలను సక్రమంగా నిర్వహించడంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని ఎంపీపీ కర్రి లక్ష్మీవెంకటనాగదేవి అన్నారు.

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

రావులపాలెం మండల పరిషత్‌ సమావేశం

రావులపాలెం, ఆగస్టు 28: పారిశుధ్య, తాగునీరు అవసరాలను సక్రమంగా నిర్వహించడంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని ఎంపీపీ కర్రి లక్ష్మీవెంకటనాగదేవి అన్నారు. రావులపాలెం మండల పరిషత్‌ సమావేశం ఎంపీపీ అధ్యక్షతన బుధవారం జరిగింది. సమావేశంలో శాఖలవారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ శాఖ అధికారి మాట్లాడుతూ రాయితీపై సూర్యఘర్‌ పథకంలో సోలార్‌ విద్యుత్‌ ప్లేట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎకరం ఖాళీ స్థలం లీజుకు ఇచ్చిన వారికి ఏడాదికి రూ.30వేలు అద్దెప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అనం తరం పీహెచ్‌సీ వైద్యాధికారి మాట్లాడుతూ సదరం ధ్రువపత్రాల మం జూరు ఆపామన్నారు. ఇచ్చిన ధ్రువపత్రాలను పునఃపరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీలు గన్నవరపు వెంకట్రావు, బి.ప్రసాద్‌, కొత్తపేట డివిజనల్‌ అభివృద్ధి అధికారి ఎస్టీవీ రాజేశ్వరరావు, ఎంపీడీవో వీవీ సాయిబాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 01:16 AM