బుద్ధ భగవాన్ విగ్రహంపై కూర్చుని ఆకతాయుల వికృత చేష్టలు
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:15 AM
కాకినాడ సిటీ, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి): జగన్నాధపురం ఘాటీ సెంటర్ అన్నమ్మ చెరువు మధ్యనున్న బుద్ధ భగవాన్ విగ్రహంపై కూ ర్చున్న ఆకతాయిల వికృత చేష్టలతో ఈ దృశ్యం కని పించింది శనివారం. ఆ ప్రాంత ఆలోచనపరుల విజ్ఞాపన మేరకు గత ప్రభుత్వ హయంలో చెరువు మద్యన 21 అడుగుల ఎత్తున బుద్ద భగవాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ చెరువు ఆధునీకరణ పనులలో భాగంగా విగ్రహం ఏర్పాటుతో పాటు మూడు వైపులా గట్టును వాకింగ్ ట్రాక్‌గా ఆ
కాకినాడ సిటీ, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి): జగన్నాధపురం ఘాటీ సెంటర్ అన్నమ్మ చెరువు మధ్యనున్న బుద్ధ భగవాన్ విగ్రహంపై కూ ర్చున్న ఆకతాయిల వికృత చేష్టలతో ఈ దృశ్యం కని పించింది శనివారం. ఆ ప్రాంత ఆలోచనపరుల విజ్ఞాపన మేరకు గత ప్రభుత్వ హయంలో చెరువు మద్యన 21 అడుగుల ఎత్తున బుద్ద భగవాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ చెరువు ఆధునీకరణ పనులలో భాగంగా విగ్రహం ఏర్పాటుతో పాటు మూడు వైపులా గట్టును వాకింగ్ ట్రాక్‌గా ఆధునీకరించారు. అయితే ఈ సుందరీకరణ పనులు మధ్యలో నిలిచిపో యాయి. దీంతో సాయంత్రం సమయంలో ఆకతాయిలు బుద్ధ భగవాన్ విగ్రహం ఎక్కి తలో భాగంలో కూర్చుని రకరకాల విన్యాసాలు చేస్తున్నా రు. ఈ ప్రాంగణంలో ఏ పర్యవేక్షణ లేకపోవడంతో తాగుబోతులకు, గంజాయి తాగేవాళ్లకు, పేకాట గాళ్లకు నిలయంగా మారిందని ఉమ్మడి జిల్లా దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, కైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు డోకుబుర్ర భధ్రం మాస్టారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కొనసాగకుండా సిటీ ఎమ్మెల్యే, నగరపాలక స్పెషల్ ఆఫీసర్, జిల్లా ఎస్పీ, ఒన్ టవున్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.