Share News

MLA Pinnelli: ఫోన్లు వదిలి పారిపోయిన పిన్నెల్లి.. పోలీసుల అదుపులో డ్రైవర్!

ABN , Publish Date - May 22 , 2024 | 01:24 PM

మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

MLA Pinnelli: ఫోన్లు వదిలి పారిపోయిన పిన్నెల్లి.. పోలీసుల అదుపులో డ్రైవర్!

పల్నాడు జిల్లా, ఆంధ్రజ్యోతి మే- 22: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లి కోసం వేట మొదలుపెట్టారు. బుధవారం ఉదయం నుంచి పిన్నెల్లి కోసం గాలిస్తుండగా.. ఆయన ఎక్కడున్నారో కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా సంగారెడ్డి సమీపంలో కారు మారి మరో కారులో పారిపోయారు!. ముంబై - హైదరాబాద్ జాతీయ రహదారి పై కంది సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే.. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను మాత్రం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కారులోనే మొబైల్ వదిలేసి పిన్నెల్లి బ్రదర్స్ పరారైనట్లు సమాచారం. డ్రైవర్ సహా వాహనాన్ని ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తెలంగాణకు పారిపోయిన పిన్నెల్లిని పట్టుకోవడానికి పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలిస్తున్నారు.


ఎక్కడున్నారు..?

కాగా.. సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వచ్చారా..? లేకుంటే రూటు మార్చారా..? ఒకవేళ హైదరాబాద్ వచ్చి ఉంటే ఎక్కడున్నారు..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన బృందాలు హైదరాబాద్‌లో పిన్నెల్లి కోసం గట్టిగానే గాలిస్తున్నాయి. పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏ క్షణమైనా పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అతి తెలివి ప్రదర్శించిన బ్రదర్స్.. ఫోన్లు ట్రేస్ చేయకుండా ఉండేందుకు కారులోని వదిలేసి పారిపోయినట్లుగా టాక్ నడుస్తోంది. నేషనల్ హైవేపై మారిన కారు నంబర్‌ సహాయంతో పిన్నెల్లిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇదివరకు.. ఇప్పుడు!

కాగా.. ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిస్తూ హింసకు పాల్పడిన పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టు భయంతో ఇప్పటికే ఒకసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్‌మెన్లను సైతం వదిలి పారిపోవడంతో అప్పట్లో పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వచ్చామని కవరింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇలా పోలీసులు గాలిస్తుండగా పరారయ్యారు. తనను అరెస్ట్ చేయకుండా పిన్నెల్లి కోర్టును ఆశ్రయించి, బెయిల్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో అని వైసీపీలో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది.


ఇంకా చదవండి


Big Breaking: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు


AP Elections 2024: పిన్నెల్లి విధ్వంసం.. సీఈఓపై ఎన్నికల సంఘం సీరియస్.. సాయంత్రం 5 లోపు..!


AP Elections 2024: పోలింగ్ బూత్‌లో ‘పిన్నెల్లి’ విధ్వంసకాండపై ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు


Updated Date - May 22 , 2024 | 02:04 PM