Share News

AP Politics: వారు నాకు శత్రువులు కాదు.. నా శిష్యులే: కేఏ పాల్

ABN , Publish Date - May 14 , 2024 | 04:19 PM

ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా పడిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. విశాఖలో భారీగా ఓట్లు పోల్ అయ్యాయని...ఎప్పుడూ ఓటు వేయని వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి నేనే అడ్డుకున్నాను..ఇది దేవుడి కృప అన్నారు.

AP Politics: వారు నాకు శత్రువులు కాదు.. నా శిష్యులే:  కేఏ పాల్
KA Paul

విశాఖపట్నం: ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా పడిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. విశాఖలో భారీగా ఓట్లు పోల్ అయ్యాయని...ఎప్పుడూ ఓటు వేయని వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి తానే అడ్డుకున్నాను..ఇది దేవుడి కృపా వల్లేనని అన్నారు.విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అంటే విశాఖలో ఎవరికీ తెలియదని.. బొత్స కుటుంబంపై ఎన్నో అవినీతి, ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు.ప్రత్యర్థులు డబ్బులు పంచినా...తాను ఒక్క పైసా పంచలేదని చెప్పుకొచ్చారు. విశాఖ ప్రజలు మార్పును కోరారని...ఈ సారి ఎన్నికల్లో తాను గెలుస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు.


తాను పార్లమెంటుకు వెళ్తే.. నరేంద్రమోదీ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ అందరినీ కలిపిస్తానని తెలిపారు. చంద్రబాబు, జగన్ ఈ ఎన్నికల్లో గాని సీఎం అయినా వారు తనకు శత్రువులు కాదని... వారు తన శిష్యులేనని చెప్పుకొచ్చారు. మా నాన్నకు విశాఖ నార్త్‌లో ఓటు ఉందని.. తాను సహాయకుడిగా వెళ్లానని అన్నారు.మా నాన్న జేడీ లక్ష్మీనారాయణకు ఓటు వేశారని తెలిపారు. ఈ ప్రభుత్వాలు ఎందుకో తనను సరిగా వాడుకోవటం లేదన్నారు. ఈవీఎంలు రీ ప్లేస్ కాకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరుతానని అన్నారు. తనకు మంచి కవరేజ్ ఇచ్చినందుకు ఏబీఎన్‌కు కేఏ పాల్ కృతజ్ఞతలు తెలిపారు.

Putta Mahesh: ఓటింగ్ అంతా కూటమికి అనుకూలం

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 04:27 PM