Home » AP Politics
వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ అప్పటి విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విపక్షాలు ఎంత చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ఏం జరగడంలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అధికారం పోయినా కొందరు వైసీపీ నాయకులు..
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్రావు, సానా సతీశ్, ఆర్.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాకినాడ పోర్టు ద్వారా భారీస్థాయిలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారో? కాకినాడ పోర్టును లాక్కోవడానికి చేసిన దౌర్జన్యాల వెనుక ఎవరున్నారో మాజీ సీఎం జగన్ నోరు విప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
‘గౌరవ మాజీ మంత్రి రోజా... ఇంతకూ నాపై ఎక్స్ వేదికగా రాతలు రాయిస్తున్నదెవరు?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
‘రాష్ట్రంలో అదానీతో విద్యుత్ ఒప్పందాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. వాటిపై ఆర్థిక, న్యాయపరంగా అన్ని కోణాల్లో చర్చించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సీఐడీ కుట్ర చేసిందని పోలీసులు వెల్లడించారు. కస్టడీలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి.. రబ్బర్ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీనిపై జూన్ 10న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదు...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ప్రధానితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై వీరిరువురు చర్చించినట్లు తెలుస్తుంది.
టీడీపీ నాయకులు, వారి కుటుంబసభ్యులు, మహిళా నేతలు, జనసేన, కాంగ్రెస్ నేతలపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను పోలీసులు విచారిస్తున్నారు.