AP Election 2024: ఆ రోజు నేను ఏడ్చాను.. అసెంబ్లీ సాక్షిగా అవమానం: ఏబీఎన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరి
ABN , Publish Date - May 10 , 2024 | 01:31 PM
అరాచకమైన ఈ ప్రభుత్వాన్ని దించేసి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలని ఏపీ ఓటర్లను నారా భువనేశ్వరి అభ్యర్థించారు. బిడ్డలకు భవిష్యత్, భద్రత ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక యువత విలవిల్లాడారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
అరాచకమైన ఈ ప్రభుత్వాన్ని దించేసి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలని ఏపీ ఓటర్లను నారా భువనేశ్వరి అభ్యర్థించారు. బిడ్డలకు భవిష్యత్, భద్రత ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక యువత విలవిల్లాడారని ఆమె విచారం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగాయని అన్నారు. అందుకే మహిళలంతా ఆలోచించాలని, మన ఇంట్లో కాదు కదా అని భావించకూడదని, రేపు మన ఇంట్లో వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని స్త్రీ ఓటర్లను నారా భువనేశ్వరి కోరారు.
చంద్రబాబు అరెస్ట్ లాంటి ఘటనలు జరుగుతాయని తాను ఎప్పుడూ అనుకోలేదని, మా కుటుంబం ఎప్పుడూ అవినీతి జోలి పోదని నారా భువనేశ్వరి అన్నారు. ఇతరుల డబ్బు ఆశించి తాము రాజకీయాలు చేయబోమని, ఈ విషయాన్ని అందరికీ ధైర్యంగా చెబుతున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు ప్రజలూ అంటారని, ప్రజల్లోనే ఆయన దేవుడ్ని చూశారని, అదే నమ్ముతున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం రాత్రింభవళ్లు కష్టపడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబును జైలులో ఇబ్బందులకు గురిచేసి సంతోషపడ్డారనే విషయం తెలిసి భార్యగా చాలా బాధపడ్డానని అన్నారు. మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూడండి.