Share News

AP Election Polling 2024: పోలింగ్ బూతుల్లో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ABN , Publish Date - May 13 , 2024 | 03:51 PM

ఏపీలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ జరగుతుందని.. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు అల్లర్లు, దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

AP Election Polling 2024: పోలింగ్ బూతుల్లో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఢిల్లీ: ఏపీలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ జరగుతుందని.. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు అల్లర్లు, దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

పోలింగ్ సవ్యంగా జరగనీయకుండా అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రజాప్రతినిధులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. పోలింగ్ జరుగనీయకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. పల్నాడు, మాచర్ల, పుంగనూరు, తాడిపత్రిలో చాలా సంఘటనలు జరిగాయని అన్నారు. మాచర్లకు చెందిన నేతను వైసీపీ నేతలు చంపేశారని మండిపడ్డారు.


AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..

పల్నాడులో ఎంపీ లావు కృష్ణదేవరాయల వాహనంపై దాడి చేశారని అన్నారు. పుంగనూరు, తాడిపత్రిలో మోడల్ కోడ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. స్పీకర్ తమ్మినేని సతీమణి సైతం బూత్ క్యాప్చర్ చేశారని చెప్పారు. తెనాలి ఎమ్మెల్యేనే పోలింగ్ బూత్‌లో ఓటరుపై దాడి చేశారన్నారు. కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లను తీసుకెళ్లారని అన్నారు. పోలింగ్ బూత్‌లో లైన్‌లో ఉన్న ఓటర్లను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేశారని దుయ్యబట్టారు.


పోలింగ్ బూత్‌లో ఉన్నవారిని ఓటు వేసుకునేలా రక్షణ కల్పించాలని ఈసీని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారని.. ఆ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించానని తెలిపారు. పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పోలింగ్ బూత్ దగ్గర ఉన్న స్థానిక పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు.

AP Election 2024: ఎమ్మెల్యే అన్నబత్తుని శివ కుమార్‌కు గృహ నిర్భంధం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 03:58 PM