RK Roja: ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి స్పందించిన రోజా
ABN , Publish Date - Jun 14 , 2024 | 07:26 PM
వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లలో నగరి నియోజకవర్గం నుంచి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి ఆమె స్పందించారు.
వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లలో నగరి నియోజకవర్గం నుంచి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి స్పందించిన ఆమె.. చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి!. కానీ మంచి చేసి ఓడిపోయాం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!’’ అంటూ ఎక్స్ వేదికగా శుక్రవారం ఆమె ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్‌కు రెండు ఫైర్ ఎమోజీలతో పాటు తన ఫొటో ఒకటి జోడించారు. దీంతో ఎన్నిక ఫలితాలు వెలువడిన దాదాపు 10 రోజుల తర్వాత ఆమె స్పందించినట్టు అయింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లో రోజా నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భాను చేతిలో ఓటమిని చవిచూశారు. కాగా ఎన్నికల ఫలితాలకు ముందు నుంచే ఆమె ఓడిపోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంచనాలకు తగ్గట్టే ఆమె ఏకంగా 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా జగన్ సర్కారులో రోజా టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన ఆ పార్టీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలు గెలిచిన ఆ పార్టీ ఏకంగా 140 సీట్లు కోల్పోయింది.