Share News

ఉక్కు ప్రైవేటీకరణపై తుది వరకు పోరాటం

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:12 AM

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేవరకు పోరాటాన్ని కొనసాగించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది.

ఉక్కు ప్రైవేటీకరణపై తుది వరకు పోరాటం

6న విశాఖలో జరిగే మానవహారానికి మద్దతు

సీపీఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానాలు

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేవరకు పోరాటాన్ని కొనసాగించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 6న విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన మానవహారం కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించింది. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ స్టీల్‌ ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు లేకపోవడంవల్ల ముడిసరుకు కొనుగోలుకే రూ.2 వేల కోట్ల పన్నుభారం పడుతోందని తెలిపారు. సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎంసీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, కౌలురైతు సంఘం, మహిళా సమాఖ్య నాయకులు మాట్లాడారు.

Updated Date - Oct 05 , 2024 | 04:12 AM