Share News

AP News: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయం సీజ్

ABN , Publish Date - Jun 05 , 2024 | 10:43 PM

తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు.

AP News: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయం సీజ్

అమరావతి: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు. ఎన్నికల కోడ్ ఓ వైపు అమల్లో ఉండగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డాక్యుమెంట్లను సిట్ పోలీసులు దగ్ధం చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే ఈ తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ ఆరోపణలు చేసింది.


సీట్ కార్యాలయం సమీపంలో హెరిటేజ్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లు దగ్ధం చేయడంపై అప్పట్లో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్పుతో విలువైన, కీలకమైన డాక్యుమెంట్లు మాయం అవుతాయని అనుమానంతో సిట్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రటరీలు, విభాగాధిపతి కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాల్లో భాగంగానే ఈ సాయంత్రం తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయానికి తాళాలు వేసి అధికారులు సీజ్ చేశారు.

Updated Date - Jun 05 , 2024 | 10:43 PM