Home » Andhra Pradesh » Guntur
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వారం రోజులపాటు కురిసిన వర్షాలు ప్రజలకు నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బుడమేరు పొంగి విజయవాడ వాసులను ముంచెత్తింది. ఇళ్లలోకి పెద్దఎత్తున నీరు చేరి దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అప్పులు ఎగొట్టేందుకు ఓ మహిళల ముఠా మాస్టర్ స్కెచ్ వేసింది. సైనైడ్ ఉపయోగించి వరుస హత్యలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతోంది. మహిళల ముఠా చాకచక్యంగా హత్యలు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతోంది.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) ,పెమ్మసాని రవిశంకర్ వారి ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబుకు పెమ్మసాని చెక్కు ఇచ్చారు.
గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈరోజు(గురువారం) విజయవాడలోని జక్కంపూడి కాలనీ వరద ప్రభావిత ప్రాంతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు.
ఏపీ సరిహద్దులో గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్ అనుమతి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలనుకుంటున్నామని నేడు (మంగళవారం) సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ఏపీలోని రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రహదారుల మరమ్మతుల కోసం ఆర్ అండ్ బీ శాఖతో మంత్రి జనార్ధన్ రెడ్డి ఈరోజు(సోమవారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత 5 ఐదేళ్లలో వైసీపీ పాలకుల తప్పులు, పాపాలకు మనం బాదితులమయ్యామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదట్నుంచీ అలవాటేనని విమర్శలు చేశారు.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వంతో ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు వర్చువల్ గా సమావేశం అయ్యారు.