Crime: కూతురు నల్లగా పుట్టిందని భర్త కర్కశం..
ABN , Publish Date - Aug 29 , 2024 | 10:01 AM
నెల్లూరు(Nellore) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుమార్తె నల్లగా జన్మించిందనే కారణంతో ఓ భర్త తన భార్యను వేధింపులకు గురి చేశాడు.
నెల్లూరు: నెల్లూరు(Nellore) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుమార్తె నల్లగా జన్మించిందనే కారణంతో ఓ భర్త తన భార్యను వేధింపులకు గురి చేశాడు. కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన మొహిద్ అనే వ్యక్తిపై కావలి ఒకటో పట్టణపోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహిద్‌కు మూడేళ్ల కిందట వివాహమైంది. తనకు జన్మించిన కూతురు నల్లగా ఉందని భర్త మొహిద్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు భార్య ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
For Latest News click here