Share News

కడపకు మహర్దశ

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:11 AM

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులున్నాయి. ఇక్కడ పరిశ్రమలకు అవసరమైన భూములు, నీరు, రోడ్డు కనెక్టివిటీ, రవాణా, రైలు మార్గం, ఎయిర్‌ కనెక్టివిటీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇప్పటి దాకా పరిస్థితి ఉండేది. 2019 నుంచి 2024 వరకు జగనే సీఎంగా ఉన్నారు.

కడపకు మహర్దశ
కొప్పర్తి ఇండసి్ట్రయల్‌ ఏరియా

ఇండసి్ట్రయల్‌ పార్కు సిటీగా కొప్పర్తి

రూ.2,137 కోట్లతో అభివృద్ధి

54వేల మందికి ఉద్యోగాలు

ఆటోమొబైల్‌, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌ పరిశ్రమల ఏర్పాటు

మారనున్న జిల్లా రూపురేఖలు

ఐదేళ్లుగా ఉద్యోగాల్లేక.. పరిశ్రమలు ఏర్పాటుకాక అల్లాడుతున్న నిరుద్యోగులకు ఇది శుభవార్త. పేరుకే కొప్పర్తి పారిశ్రామిక వాడ.. వేల ఎకరాల భూములున్నా ఐదేళ్లుగా ఇక్కడకు వచ్చిన కంపెనీలు ఒకటి రెండే. ఉపాఽధి దొరికిందీ తక్కువమందికే. జగన ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో అంటకాగినా స్వప్రయోజనాలకు తప్ప జిల్లా అభివృద్ధికోసం కేంద్రాన్ని పట్టుబట్టలేదు. ఇటీవల వైసీపీ ఓటమి పాలై.. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో జిల్లాకు మహర్దశ పట్టనుంది. కొప్పర్తి పారిశ్రామక వాడను ఇండస్ర్టియల్‌ పార్కు సిటీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2,137 కోట్లతో దీనిని అభివృద్ధి చేయనుంది. 54 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులున్నాయి. ఇక్కడ పరిశ్రమలకు అవసరమైన భూములు, నీరు, రోడ్డు కనెక్టివిటీ, రవాణా, రైలు మార్గం, ఎయిర్‌ కనెక్టివిటీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇప్పటి దాకా పరిస్థితి ఉండేది. 2019 నుంచి 2024 వరకు జగనే సీఎంగా ఉన్నారు. పార్లమెంటు, రాజ్యసభల్లో 20 మంది ఎంపీలు ఉన్నారు. అయినా వారిని జిల్లా అభివృద్ధికి వాడుకోకుండా సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. జగన స్టీలు ప్లాంటు నిర్మాణానికి రెండుసార్లు టెంకాయలు కొట్టాడే కానీ ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం చేపట్టలేదు. అయితే నిన్న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమికి జనం అద్భుత మెజార్టీ కట్టబెట్టారు. కేంద్రంలో మోదీ మరోసారి రాగా, రాష్ట్రంలో చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. ఎన్డీయే కూటమితో జిల్లా రూపురేఖలే మారిపోనున్నాయి. ఇందులో భాగంగా ఓ బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో కొత్తగా 12 ప్రాంతాల్లో 12 స్మార్ట్‌ పారిశ్రామిక సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్‌ వెల్లడించారు. తయారీ రంగానికి ఈ స్మార్ట్‌ సిటీలు మరింత ఊతమిస్తాయన్నారు. పదిలక్షలు ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఈ 12 స్మార్ట్‌ ఇండసి్ట్రయల్‌ సిటీలలో మన కొప్పర్తి పారిశ్రామికవాడ కూడా ఉంది. దీనిని పారిశ్రామిక హబ్‌ కింద అభివృద్ధి చేస్తారు. ఇక్కడ 54వేల మందికి ఉపాధి కలుగనుంది. దీంతో జిల్లా ముఖచిత్రమే మారిపోనుంది.

మారిపోనున్న రూపురేఖలు

కడప నగర శివారులోనే కొప్పర్తి పారిశ్రామికవాడ ఉంది. సౌత బ్లాక్‌లో 2,596 ఎకరాలు ఉంది. దీనిని పారిశ్రామిక స్మార్ట్‌సిటీలో భాగంగా 2,137 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు. అంటే రోడ్లు, విద్యుత, నీరు, ఇతర సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. మొత్తం రూ.8,760 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమల ద్వారా 54,500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ పారిశ్రామిక సిటీలో ఆటోమొబైల్స్‌ తయారీ, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌, నానమెటలిక్‌ మినరల్స్‌, మెటలిక్‌ మినరల్స్‌.. ఇలా పలు పరిశ్రమల ఏర్పాటు కానున్నాయి. ఇది తయారీ ఉత్పత్తి రంగానికి హబ్‌గా మారనుంది. దీంతో కడప జిల్లా రూపురేఖలే మారిపోన్నాయి. ఇక్కడ ప్రత్యక్షంగా 54వేల మందికి ఉపాధి కలిగితే వాటి అనుబంధ సంస్థల ద్వారా ఈ ఉపాధి సంఖ్య మరింత పెరుగుతుంది.

అన్నీ సానుకూలతలే

కొప్పర్తి పారిశ్రామికవాడకు ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. రాయలసీమ నడిబొడ్డు అయిన కడప శివారులోనే కొప్పర్తి పారిశ్రామిక ఉండడం, ఇక్కడ నుంచి రోడ్లు, రైలు, ఎయిర్‌ కనెక్టివిటీతో పాటు విమానాశ్రయం కూడా దగ్గరలోనే ఉండడం బాగా కలిసి వచ్చే అంశం. జిల్లాలో కడప-పులివెందుల సేట్‌ హైవేకి కొప్పర్తి పారిశ్రామికవాడ ఐదు కి.మీ దూరంలో ఉంది. అలాగే.. కర్నూల-రాణిపేటకు ఎనహెచ 40 ఉంది. కడప - చెన్నై జాతీయ రహదారికి కొప్పర్తి 8 కి.మీ దూరంలో ఉంది. ఎనహెచ 544ఎఫ్‌ అనంతపురం - విజయవాడ, ఇక క్రిష్ణపట్నం పోర్టు సైతం దీనికి దగ్గరలో ఉన్నాయి. క్రిష్ణాపురం రైల్వేమార్గానికి 9 కి.మీ, కడప జంక్షనకు 13 కి.మీ, కడప విమానాశ్రయం 11 కిమ.మీ, తిరుపతిఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు 150 కి.మీ, క్రిష్ణపట్నం పోర్టు 200 కి.మీ, క్రిష్ణపట్నం -చెన్నై పోర్టు 270 కి.మీ, కొప్పర్తి రైలు కార్గో 9 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇటు క్రిష్ణపట్నం 196 కి.మీ, అనంతపురం 157 కి.మీ దూరంలో ఉన్నాయి. చెన్నై, బెంగళూరు మెట్రో సిటీలు 250 కి,మీ దూరంలో ఉన్నాయి. అక్కడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులున్నాయి. కొప్పర్తి పారిశ్రామిక వాడకు ఇన్ని సానుకూలతలు ఉన్నాయి.

మారిపోనున్న రూపురేఖలు

కొప్పర్తి మెగా ఇండసి్ట్రయల్‌ సిటీతో కడప రూపురేఖలు మారిపోనున్నాయి. జిల్లాలో ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవు. కనీసం 10వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలే లేవు. ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి. స్టీలు ఫ్యాక్టరీ కోసం జిల్లావాసులు 18ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు అడుగులు ముందుకు పడడంలేదు. కొప్పర్తిలో చిన్న చితక పరిశ్రమలు ఉన్నా కనీసం 4వేల మందికి కూడా ఉపాధి దొరకడం లేదు. దీంతో ఉపాధి లేక కొందరు నిరుద్యోగులు ఇతర రాషా్ట్రలకు వలస పోతే మరికొందరు గల్ఫ్‌కు వెళ్లారు. ఈ నేపధ్యంలో కొప్పర్తిని ఇండసి్ట్రయల్‌ ిసిటీగా కేంద్రం ప్రకటించి రూ.2,137 కోట్లతో అభివృద్ధి చేయనుండడంతో జిల్లా రూపురేఖలే మారనున్నాయి. దీంతో కడప సిటీ కూడా అభివృద్ధి చెందనుంది.

Updated Date - Aug 29 , 2024 | 12:11 AM