Minister Mandipalli తాగునీటి సమస్య పరిష్కారం మా బాధ్యత
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:08 PM
రాయచోటి నియోజకవర్గంలోని ప్రజల దాహం తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
సంబేపల్లె, అక్టోబరు1: రాయచోటి నియోజకవర్గంలోని ప్రజల దాహం తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సంబేపల్లె మండలం రెడ్డివారిపల్లె, సీఎం కొత్తపల్లి, దేవపట్ల, కట్టుగుత్తపల్లెలో వేసిన బోర్లను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామాల్లో తాగునీటి సమస్యను స్థానిక నాయకులు తమ దృష్టికి తేవడంతో బోర్లు వేయించామన్నారు. గతంలో ఉన్న నీటి పథకం బోర్లు అడుగంటిపోవడంతో ఈ ఏడాది వేసవి రాకముందే పల్లెల్లో నీటి ఎద్డడి మొదలైంద న్నారు. బోర్లు ఫెయిలైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి ప్రజల దాహం తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మల్లు నరసారెడ్డి, యువగళం సభ్యులు మండిపల్లి సిద్దారెడ్డి, ఎంపీడీవో సునీల్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ మహేశ్వరి, భయ్యారెడ్డి, నూరెకరాల రంగారెడ్డి, కిరనరెడ్డి, శేఖర్‌రెడ్డి, రామచంద్ర, వెంకటేశ్వర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వీరభద్రుడికి పూజలు
పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని మంగళవారం ఉదయం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ జిల్లా అధి కారి విశ్వనాథ్, ఆలయ ఈవో డీవీ కొండారెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరభద్రస్వామిని, భద్రకాలి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి, ఆలయ ఈవో దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగాల రెగ్యులరైజేషన అంశాన్ని ఆలయంలో పనిచేస్తున్న అర్చ కులు, సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ఉన్న ఆలయంలో ధూప, దీప నైవేద్యం, శ్రీవాణి ట్రస్టు నిధుల కింద ఉన్న దేవాలయాల వివరాలు, సర్వశ్రేయోనిధి ద్వారా జరిగే అభివృద్ధి పనులు, దేవాలయాల ఆస్తులు, వాటి స్థితిగతుల వివరాలను జిల్లా దేవాదాయశాఖ అధికారి మంత్రికి వివరించారు. వీరభద్రస్వామి గుడి ఎదురుగా ఉన్న ట్రాన్సఫార్మర్ కారణంగా సమస్యలు ఏర్పడుతున్నట్లు ఆలయ ఈవో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, ప్రైవేటు కళాశాలల అసోసియేషన అధ్యక్షుడు డాక్టర్ పీ. మదనమోహనరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, అర్చకులు, ఆలయ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహనీయుని బాటలో మనమంతా
మహాత్మాగాంధీ స్వాతంత్ర ఉదమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా స్వాతంత్య్ర సమరయోధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చా డని అటువంటి మహనీయుని బాటలో మనమంతా కలిసి నడవాలని, సేవాభావంతో ప్రజలకు తన మన బేధాలు లేకుండా సేవ చేయడమే మహాత్మాగాంధీ ఘనమైన నివాళి అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మీడియాకు తెలిపారు. మహ నీయుని బాటలోనే సీఎం చంద్రబాబునాయుడు గ్రామ గ్రామాల్లో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందజేస్తూ ఇదే మంచి ప్రభుత్వం అనే దిశగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
================================