Share News

ప్రభుత్వ భూఆక్రమణలపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Sep 03 , 2024 | 11:07 PM

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశిం చారు.

ప్రభుత్వ భూఆక్రమణలపై చర్యలు తీసుకోండి
స్థానికుల సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

సంబేపల్లె, సెప్టెంబరు 3: ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశిం చారు. మంగళవారం మండల పరిధిలో దేవపట్ల గ్రామంలో గంగాహోటల్‌ సమీపంలో 30 ఏకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఆర్డీవోతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్టపల్లె, గుడిబండ రోడ్డు మార్గంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్ప డిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ భూమిలో దున్నకాలు చేపట్టడంతో వెంటనే అధికారులు స్పందించి బోర్డు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై తహశీల్దార్‌తో మాట్లాడారు. గతంలో తహశీల్దార్‌ ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోకపోగా.. వారికి సహకరించినట్లు తెలిపారు. దేవపట్ల గురుకుల పాఠశాల వద్ద చిన్నపీరయ్య అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతుంటే ఏఎస్‌ఐ ఆయూబ్‌ ఖాన అడ్డుకున్నట్లు తెలపడంతో.. మిగిలిన వాళ్లను ఎందుకు అడ్డుకోలేదని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడికి ఓ న్యాయం, ఉన్నవాడికి ఓ న్యాయమా అంటూ ఆయనపై చిందులేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమించిన వారు ఎంతటి వారైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్ర మంలో మాజీ జడ్పీటీసీ మల్లు నరసా రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బయ్యారెడ్డి, ఖాదర్‌హుసేనలు పాల్గొన్నారు.ు.

Updated Date - Sep 03 , 2024 | 11:07 PM