Share News

రైతులు, వ్యాపారుల సహకారంతోనే రైతు బజార్ల విజయవంతం

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:26 PM

రైతు బజార్‌ నిర్వహణకు రైతులు, వ్యాపారుల సహకారం చాలా అవసరమని మార్కెటింగ్‌ శాఖ ఏడీ త్యాగ రాజు, ఉద్యానశాఖ జిల్లా అధికారి రవిచంద్ర బాబు తెలియజేశారు. బుధవారం స్థానిక రైతు బజార్‌లో రైతులు, వ్యాపారులు, పురప్రముఖుల తో సమావేశం నిర్వహించారు.

రైతులు, వ్యాపారుల సహకారంతోనే రైతు బజార్ల విజయవంతం
మాట్లాడుతున్న మార్కెటింగ్‌ ఏడీ త్యాగరాజు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 4: రైతు బజార్‌ నిర్వహణకు రైతులు, వ్యాపారుల సహకారం చాలా అవసరమని మార్కెటింగ్‌ శాఖ ఏడీ త్యాగ రాజు, ఉద్యానశాఖ జిల్లా అధికారి రవిచంద్ర బాబు తెలియజేశారు. బుధవారం స్థానిక రైతు బజార్‌లో రైతులు, వ్యాపారులు, పురప్రముఖుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాటాడుతూ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రైతు బజార్‌లు విజయవంతంగా నడుస్తున్నాయ ని, కానీ, మదనపల్లెలో నిరుపయోగంగా ఉండ టంతో చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌, జా యింట్‌ కలెక్టర్‌ ఆదేశించారన్నారు. దీనిపై రైతు లు, ఎఫ్‌పీవోలు, వ్యాపారుల అభిప్రాయాలను కోరారు. రైతు బజార్‌ పక్కనే ఉన్న వారపు సంతకు అడ్డంగా వున్న గోడ తొలగించి రైతులు, వ్యాపారులు రైతుబజార్‌లోని స్టాళ్లను వినియో గించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉ ద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు మాట్లాడు తూ ఉద్యాన పంటలు, పాలు, పెరుగు, చేపలు, కోడిగుడ్లు తదితరాలను ఇక్కడ వున్న 34 స్టాళ్లలో విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ప్రకృతివనం ప్రసాద్‌ మాట్లాడు తూ బయట మార్కెట్‌లోగేటు రుసుం చెల్లించాలని, అదే రైతు బజార్‌లో విక్రయిస్తే ఎలాంటి గేటు రు సుం వుండదన్నారు. రైతులు కూడా వారి అభి ప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటి ని పరిగణలోకి తీసుకుని అధికారులు ప్రణాళిక లు సిద్ధం చేసి రైతు బజార్‌ను నిర్వహణలోకి తీసుకొస్తారన్నారు. ఈ సమావేశంలో ఫిషరీస్‌ ఏడీ సుస్మిత, మార్కెట్‌ యార్డు సెక్రెటరీ అభిలాష్‌, ఉద్యాన అధికారి ఈశ్వరప్రసాద్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 11:26 PM