Clay for road work : కదిరే కుంట రోడ్డు పనికి కుంటమట్టి
ABN , Publish Date - Nov 17 , 2024 | 10:54 PM
కదిరే కుంట రోడ్డు పనులకు కుంట మట్టి తోలారు. పనులు ఈమట్టితోనే సాగితే నాణ్యతకు తిలోద కాలు ఇచ్చినట్లే. ఇక్కడ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఖర్చు తక్కువని కుం ట మట్టి తోలారు. ఈ తంతు మూడు రోజులు గా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వివరాల్లోకెళితే....
సంబేపల్లె, నవంబరు17(ఆంధ్రజ్యోతి): కదిరే కుంట రోడ్డు పనులకు కుంట మట్టి తోలారు. పనులు ఈమట్టితోనే సాగితే నాణ్యతకు తిలోద కాలు ఇచ్చినట్లే. ఇక్కడ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఖర్చు తక్కువని కుం ట మట్టి తోలారు. ఈ తంతు మూడు రోజులు గా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వివరాల్లోకెళితే....
కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు సిమెంటు రోడ్లు మంజూరయ్యాయి. మండలం లో హరిజనవాడ నుంచి బొగ్గులవారిపల్లె వర కు, బొగ్గులవారి పల్లె నుంచి ఊటుపాలెం మీ దుగా అంబేడ్కర్ నగర్ హరిజన వాడ వరకు ఒక్కో పనికి రూ.50 లక్షలు చొప్పున రెండు పనులకు కోటి రూపాయ లు మంజూరైంది. రోడ్డు పనుల్లో గ్రా వెల్ (ఎర్రమట్టి) తోలాలి. అయితే కుంట దగ్గర గా ఉందని, ఖర్చు తక్కువ అవుతుందని కుం ట మట్టి తోలారు. అధికారుల పర్యవేక్షణ కొరవ డడంతో ఈ తంతు మూడు రోజులుగా జరుగు తోంది. కుంటల్లో, చెరువుల్లో మట్టి కేవలం రైతు ల పొలాల్లో సారవంతం కోసం మాత్రమే తోలు కోవాలి తప్ప మిగిలిన పనులకు వినియోగించ రాదు. అయితే అడిగేవాడు లేకపోతే తోలుకున్న వాడికి తోలుకున్నంత అన్న సామెతగా మారి పోయింది. మండలంలో చాలా చోట్ల మట్టి తోలి బొరియలు చేశారు. ఇరిగేషన్ అధికారులు మట్టి అక్రమణ తరలింపుపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
కదిరేకుంట కుంట మట్టి అక్రమ తరలింపుపై తహసీల్దార్ వెంకటేశులును వివరణ కోరగా వెంటనే ఆర్‌ఐ, వీఆర్‌ఓలను పంపి మట్టి తరలింపు నిలుపుదల చేయాలని ఆదేశించారు. అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్నారు.