AP News; హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి
ABN , Publish Date - Nov 21 , 2024 | 09:23 AM
ఏపీ శాసనసభలో గురువారం 6 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నాయి. టెండర్లను న్యాయ పరిశీలనకు పంపే బిల్లు రద్దు, ఆలయాల ధర్మకర్తల మండళ్లలో సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తూ దేవాదాయశాఖ సవరణ చట్టం, సహజ వాయువుపై వ్యాట్‌ను తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తదితర బిల్లులపై సభలో చర్చించి ప్రభుత్వం ఆమోదించనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (Andhra Pradesh Budget Meetings) 9వ రోజు (9th Day) గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగనుంది. రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్... విద్యుత్ చార్జీలు.. పుష్కర ఎత్తి పోతల పథకం... వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి.. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిధులు.. ఆన్ లైన్ యాప్‌లు టిడ్ కో గృహాలు.... ఇమామ్‌లు మౌజన్లకు గౌరవ వేతనం... ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్... విశాఖలో ఐటి హబ్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ప్రశ్నోత్తరాల అనంతరం..
ప్రశ్నోత్తరాల అనంతరం సభలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విధివిధానాలపై కేంద్రానికి పంపనున్న తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం పలు పాలసీలపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. డ్రోన్, క్రీడలు, టూరిజం, ఎలక్ట్రానిక్, డేటా సెంటర్ పాలసీలపై సంబంధిత శాఖల మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, నారా లోకేష్ ప్రకటన చేయనున్నారు.
సభలో ఆరు బిల్లుల ఆమోదం..
శాసనసభలో ఈరోజు 6 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నాయి. టెండర్లను న్యాయ పరిశీలనకు పంపే బిల్లు రద్దు, ఆలయాల ధర్మకర్తల మండళ్లలో సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తూ దేవాదాయశాఖ సవరణ చట్టం, సహజ వాయువుపై వ్యాట్‌ను తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తదితర బిల్లులపై సభలో చర్చించి ప్రభుత్వం ఆమోదించనుంది. కాగా రుషికొండలో అక్రమ కట్టడాలు ప్రజా ధనం దుర్వినియోగంపై సభలో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. అలాగే ఇటీవల రాష్ర్టంలో ఏర్పడిన వరదలతో రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులపై శాసనసభ స్వల్పకాలిక చర్చ చేపట్టనుంది.
పీఏసీపై ఉత్కంఠ..
శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీలకు ఈరోజుఎన్నిక జరగనుంది. ఈసారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక ఆసక్తిగా మారింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీను ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. పీఏసీలో సభ్యుడిగా ఎన్నికకు అవసరమైన కనీస ఓట్లు 18. అయితే ప్రతిపక్షానికి 11 స్థానాలు మాత్రమే కావడం.. వారు అసెంబ్లీకి రాకపోవడంతో పీఏసీపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షం నుంచి కనీసం ఎవరైనా నామినేషన్ వేస్తారా, లేదా అన్న దానిపైనా ఆసక్తి నెలకొంది.
కాగా శాసన మండలి సమావేశాలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలాతో ప్రారంభం కానున్నాయి. విశాఖ తీరంలో వాయు కాలుష్యం... విశాఖలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ .. భూముల రీ సర్వే.. కౌలు రైతుల కార్డులు... విశాఖ పట్టణంలో తీర పర్యాటకం... వైఎస్ఆర్ కడప జిల్లా దాల్మియా సిమెంట్స్ ఫ్యాక్టరీ.. తదితర అంశాలపై సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాదర్నా వాయిదా
ఐటీకి మరింత ఊతం: సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News