ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Nov 21 , 2024 | 09:57 AM
గత జగన్ పాలన పాపం ఫలితంగా లిప్ట్ స్కీములు పని చేయక 4 లక్షల ఎకరాలు బీడుపడ్డాయని... తాళ్ళూరు లిప్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్ట్లు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాళ్ళూరు లిప్ట్కు సంబంధించి పిఎస్సి పైపుల స్దానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly budget meetings) గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది (Question time continues). పుష్కర ఎత్తిపోతల పధకంలో భాగమైన తాళ్ళూరు లిప్ట్ పైపులు లీకేజిలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. లిప్ట్ స్కీమ్ల నిర్వహణ, మోటార్ల మరమ్మత్తులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా జగన్ ఎత్తిపోతలను నిర్వీర్యం చేశారని. అందుకే జగన్ హాయాంలో 1040 లిప్ట్ స్కీములకు గానూ 450 స్కీమ్లు మూతపడ్డాయన్నారు. గత పాలన పాపం ఫలితంగా లిప్ట్ స్కీములు పని చేయక 4లక్షల ఎకరాలు బీడుపడ్డాయన్నారు. తాళ్ళూరు లిప్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్ట్లు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయన్నారు. తాళ్ళూరు లిప్ట్కు సంబందించి పిఎస్సి పైపుల స్దానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ మీ కోసం..
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాదర్నా వాయిదా
ఐటీకి మరింత ఊతం: సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 21 , 2024 | 09:57 AM