Share News

ఎమ్మిగనూరు అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 27 , 2024 | 11:26 PM

ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. దాదాపు 25 నిమిసాలు సీఎం చంద్రబాబుతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులపై చర్చించారు.

ఎమ్మిగనూరు అభివృద్ధికి ప్రాధాన్యం

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే బీవీ

కర్నూలు, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. దాదాపు 25 నిమిసాలు సీఎం చంద్రబాబుతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. బనవాసి జెర్సీ పశుక్షేత్రంలో దాదాపు 3,500 ఎకరాల భూములు ఉన్నాయనీ సీఎం చంద్రబాబుకు వివరించారు. చేనేతల అభివృద్ధి కోసం మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే బనవాసి పశుక్షేత్రంలో నేషనల్‌ అనిమల్‌ డీసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం సెంటరు ఏర్పాటుతో పాటు వైరల్‌ వ్యాక్సిన్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 100-150 ఎకరాల భూమి అవసరం ఉంది. పీ-3, పీ-4 మోడల్‌లో నిర్మాణం చేపట్టే ఈ యూనిట్‌ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే క్రమంలో ఎమ్మిగనూరు-కర్నూలు నాలుగు లైన్ల జాతీయ రహదారి, మంత్రాలయం, కర్నూలు వయా ఎమ్మిగనూరు రైల్వేలైన్‌ ప్రాజెక్టులపై కూడా సీఎం బాబు దృష్టికి బీవీ తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అదే క్రమంలో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని, అసంపూర్తిగా ఆగిపోయిన ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులు, గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంపు పనులకు నిధులు కేటాయించి ఆ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బీవీ సీఎం చంద్రబాబుకు వివరించారు. త్వరలోనే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Aug 27 , 2024 | 11:26 PM