Share News

Rain: అల్లకల్లోలంగా సముద్రం.. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు

ABN , Publish Date - May 22 , 2024 | 02:55 PM

ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని, నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖ అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించారు.

Rain: అల్లకల్లోలంగా సముద్రం.. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు
rain alert

విశాఖపట్టణం: ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని, నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖ అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని సూచించారు. వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై అంతగా ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.


For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 22 , 2024 | 02:55 PM