Share News

Vinayaka Chavithi 2024: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ ఆధ్వర్యంలో 10 వేల మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

ABN , Publish Date - Sep 06 , 2024 | 08:24 PM

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. రేపు గణేశ్ చతుర్థి పర్వదినం కావడంతో విగ్రహాల ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా నెల్లూరులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ ఆధ్వర్యంలో 10 వేల మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ జరిగింది.

Vinayaka Chavithi 2024: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ ఆధ్వర్యంలో 10 వేల మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

నెల్లూరు: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. రేపు గణేశ్ చతుర్థి పర్వదినం కావడంతో విగ్రహాల ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా నెల్లూరులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ ఆధ్వర్యంలో 10 వేల మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ జరిగింది. ఇరవై ఏళ్లుగా ప్రతి ఏడాది మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కొనసాగుతోంది. పర్యావరణ పరిరక్షణపై జనాల్లో అవగాహన కల్పించడం కోసం ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.


నెల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, సీఎంఆర్ అధినేత మావూరి శ్రీమివాసులు, రాజీ యాడ్స్ అధినేత మోపూరు పెంచలయ్య, ఆంధ్రజ్యోతి బీఎం కే.హరికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడారు. ఏబీఎన్- ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ సంస్థలు మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి ప్రతిమలనే పూజించాలని ఆయన సూచించారు. కాగా హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీస్ వద్ద కూడా మట్టీ గణపయ్య ప్రతిమల పంపిణీ జరిగింది. అనేకమంది గణేశ్ ప్రతిమలను అందుకున్నారు.

Updated Date - Sep 06 , 2024 | 08:27 PM