Share News

AP News: ఏబీఎన్‌తో మంత్రి ఆనం ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:41 PM

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌తో మాట్లాడుతూ ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన నివాసంలో పార్టీ శ్రేణులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నామని, అయితే వైసీపీ ఎంపీటీసీ ఒకరు స్వామి మాలలో నేరుగా సమావేశంలో చొరపడ్డాడని మంత్రి చెప్పారు.

AP News: ఏబీఎన్‌తో మంత్రి ఆనం ఆసక్తికర వ్యాఖ్యలు..
Anam Ramanarayana Reddy

నెల్లూరు: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌తో మాట్లాడుతూ ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన నివాసంలో పార్టీ శ్రేణులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నామని, అయితే వైసీపీకి చెందిన ఎంపీటీసీ ఒకరు స్వామి మాలలో నేరుగా సమావేశంలో చొరపడ్డాడని మంత్రి తెలిపారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో, పరిసర ప్రాంతాలపై అతడు రెక్కీ చేశాడని, తమవాళ్లు గుర్తించి తన వద్దకి తీసుకొచ్చారని మంత్రి ఆనం చెప్పారు. అతడి మాటలు అనుమానాస్పదంగా అనిపించాయని, దీంతో పోలీసులకు అప్పగించామని ఆయన చెప్పారు.


గత వైసీపీ ప్రభుత్వం తన భద్రతను తొలగించిందని మంత్రి ఆనం విచారం వ్యక్తం చేశారు. ‘‘నేను మంత్రి అయ్యాక సీఎం చంద్రబాబు సోమశిలకు వచ్చారు. వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ఇక్కడ జరుగుతోంది. దానిని కూడా ప్రతిపక్ష నేతలు సహించలేకపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మేకపాటి సోదరులు ఒక్క అభివృద్ది పని కూడా చేయలేకపోయారు’’ అని మంత్రి విమర్శలు గుప్పించారు.

ప్రజల భద్రతతో‌ పాటు తమ భద్రత గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి ఆనం విచారం వ్యక్తం చేశారు. ‘‘మాకు ఆయుధాల లైసెన్సులు ఉన్నాయి. ఇకపై ఆయుధాలతో తిరిగే విషయమై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.


జగన్ పాలపై మంత్రి నిమ్మల తీవ్ర విమర్శలు..

మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ పాలనలో నిధులు లేక పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌లు భిక్షమెత్తుకున్న దుస్థితి చూశామని ఆనాటి పరిస్థితులను గుర్తుచేశారు. నవంబర్ నెల నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ‘‘సాక్షి విలేకరికి సిగ్గుండాలి. నా సొంత గ్రామానికి రోడ్డు లేదని రాశారు. నేనే రూ.10 కోట్లతో రోడ్డు వేశాను. జీతం కోసం విలేకరి బానిసగా మారిపోయారు. సాక్షి పేపరు చదవడం ఆరోగ్యానికి హానికరం అని ప్రజలు గుర్తించాలి. రాష్ట్రవ్యాప్తంగా రూ.300 కోట్లు వ్యయంతో ఆర్ అండ్ బీ రహదారులకు మరమ్మతులు చేపడతాం’’ అని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


ఇవి కూడా చదవండి

హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

కివీస్ చేతిలో అనూహ్య ఓటమి.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా

For more AP News and Telugu News

Updated Date - Oct 20 , 2024 | 04:02 PM