Share News

YS Jagan: క్యాడర్‌ను కాపాడుకునేందుకు వైసీపీ అధినేత అష్టకష్టాలు..

ABN , Publish Date - Jul 04 , 2024 | 08:49 PM

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్‌పై సొంత క్యాడర్‌ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టమనే చర్చ నడుస్తోంది.

YS Jagan: క్యాడర్‌ను కాపాడుకునేందుకు వైసీపీ అధినేత అష్టకష్టాలు..
CM Jagan

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్‌పై సొంత క్యాడర్‌ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టమనే చర్చ నడుస్తోంది. ఈక్రమంలో పార్టీ క్యాడర్ ఇతర పార్టీలకు జంప్ అవుతారని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి క్యాడర్ అంతా జారుకుంటారని వైసీపీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. ఈ క్రమంలో క్యాడర్‌ను కాపాడుకునేందుకు జగన్ అష్టకష్టాలు పడుతున్నారట. ఎన్నికల హామీలపై టీడీపీ కూటమిని, సీఎం చంద్రబాబును టార్గెట్ చేయాలనే వైసీపీ ప్లాన్ బెడిసికొట్టడంతో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ఏమి చేయాలో జగన్‌కు అర్థం కావడంలేదట. దీంతో తాడేపల్లి ప్యాలెస్‌ను వదిలి ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలనే ప్లాన్‌లో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అక్కడకక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహా.. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు నెలకొన్నాయి. ఎలాంటి అశాంతి లేదు. అయినప్పటికీ టీడీపీ, జనసేన నాయకులు రాజకయ కక్షతో వైసీపీ శ్రేణులపై దాడి చేస్తున్నారనే ఓ దుష్ఫ్రచారాన్ని వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు. దీంతో ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగించడంతో పాటు.. టీడీపీ కూటమి హింసను ప్రేరేపిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో కలిగేందుకు వైసీపీ ఓ కుట్రను పన్నినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గురువారం నెల్లూరు జైల్లో ఉన్న పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆయన కుట్రలో భాగమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Deputy CM Pawan: పీసీబీ ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా!


హెచ్చిరక అంటూ..

రాష్ట్రంలో టీడీపీ కూటమి అరాచకాలకు పాల్పడుతోందని.. వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అంటూ మాట్లాడారు. అయితే టీడీపీ నేతలు జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. అశాంతిని సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. పార్టీ నాయకులు చేసిన తప్పులను ఖండించాల్సిన అధినేత పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగలగొట్టిన వ్యక్తులు ఎలాంటి తప్పు చేయలేదని సమర్థించుకురావడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులు చేసిన అరాచకాలను సమర్థించుకుపోవడం వల్లనే రాష్ట్రప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని.. విపక్షంలో ఉండి అదే పనిచేస్తే రాష్ట్రప్రజలు వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారని అంటున్నారు. సీఎంగా ఉండి ఐదేళ్ల పాటు వైసీపీ నాయకుల అరాచకాలను వెనకేసుకువచ్చిన జగన్ అధికారం కోల్పోయాక.. శాంతిభద్రతలను పరిరక్షించడమే ప్రాధాన్యమంటూ.. ఎవరైనా పార్టీ నాయకులు హద్దుమీరితే వార్నింగ్ ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు హస్యాస్పదమని టీడీపీ నాయకులు అంటున్నారు.

MP Kesineni Sivanath: విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్రమంత్రి పచ్చజెండా..


సమాధానం చెప్పకుండానే..

పోలింగ్ బూత్‌లో బహిరంగంగా ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యక్తిని సమర్థిస్తున్నారా అంటూ ఓ రిపొర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకుండానే జగన్ వెనుదిరిగారు. మరోవైపు పిన్నెల్లి ఎలాంటి తప్పు చేయలేదని సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిద్వారా ఓరకంగా పార్టీ శ్రేణులు ఎలాంటి తప్పులు చేసినా తాను సమర్థిస్తాననే సంకేతాలు వైసీపీ అధినేత ఇచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Anitha: పిన్నెల్లిని జగన్ పరామర్శించడంపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్


సానుభూతి కోసమేనా..

వైసీపీపై ఏపీ ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారనే విషయం ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైంది. ఈక్రమంలో ప్రజలకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో.. తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ కూటమి నాయకులు దాడి చేస్తున్నారనే ఓ తప్పుడు ప్రచారం ద్వారా.. పరామర్శల పేరుతో ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందాలనే ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సానుభూతితో కనీసం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పరువు దక్కించుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. అసలు జగన్ ప్లాన్ ఏమిటి.. భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుందనేదానిపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


YSRCP: ఆరోపణలు, ప్రత్యారోపణలతో రసాభాసగా వైసీపీ సమావేశం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 04 , 2024 | 08:49 PM