Share News

రాక్రీట్‌ అక్రమాలపై విచారణ జరిపించండి

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:50 PM

ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన రాక్రీట్‌ సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిని కలిశారు.

రాక్రీట్‌ అక్రమాలపై   విచారణ జరిపించండి
సీఎం చంద్రబాబునాయుడును కలిసి వివరాలు అందజేస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

ఇళ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి

పేరూరు ప్రాజెక్టుకు నీరందించే పనులు ప్రారంభించండి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే పరిటాల సునీత వినతి

అనంతపురం, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన రాక్రీట్‌ సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిని కలిశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రాక్రీట్‌ సంస్థ పేరుతో అప్పటి ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డికి సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుందన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండానే రూ.200 కోట్లు డబ్బులు కాజేశారన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.15 లక్షల జగనన్న ఇళ్లల్లో 63 వేలు రాక్రీట్‌ సంస్థకే కేటాయించినట్లు వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం, వైఎ్‌సఆర్‌, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్‌, ఏలూరు, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని గృహనిర్మాణ పనులను రాక్రీట్‌కు అప్పగించారని ఆమె తెలిపారు.

టెండర్లే లేవు

నిబంధనల మేరకు రూ.పది లక్షలకు మించిన పనులకు టెండరు విధానాన్ని పాటించాల్సి ఉంది. అయితే రాక్రీట్‌ సంస్థకు ఇళ్లను కేటాయించే విషయం ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోలేదని ఆమె ఫిర్యాదు చేశారు. రూ.1,100 కోట్ల విలువైన పేదల ఇళ్ల నిర్మాణాన్ని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి బంధువు, అనుచరవర్గం డైరెక్టర్లుగా ఉన్న రాక్రీట్‌ ఇన్ఫాస్ట్రక్చర్స్‌ అండ్‌ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారికి కట్టబెట్టారన్నారు. తీసుకున్న పనులను కూడా సక్రమంగా చేయలేదన్నారు. ఇసుక, సిమెంటు, ఐరన పేరుతో పెద్ద ఎత్తున నిధుల దోపిడీ జరిగిందన్నారు. కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించ కుండా బిల్లులు కాజేసినట్లు ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేయించాలని మంత్రిని కోరారు. ఈ విషయంపై గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి తీవ్రంగా స్పందించి అక్కడే సమావేశంలో ఉన్న హౌసింగ్‌ సెక్రటరీతో మాట్లాడి అన్ని వివరాలు సమగ్రంగా అందించాలని ఆదేశించారు.

అప్పర్‌ పెన్నార్‌ పనులు మళ్లీ ప్రారంభించాలి

రామగిరి మండలంలోని అప్పర్‌పెన్నార్‌ ప్రాజెక్టుకు నీరందించే పనులు మళ్లీ ప్రారంభించాలన్నారు. 2018లో రూ.804 కోట్లతో పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి పేరూరు ప్రాజెక్టుకు 53 కి.మీ మేర కాలువ తవ్వి హంద్రీనీవా నుంచి నీరు అందించాలని ప్రతిపాదించామన్నారు. అప్పట్లో నిధులు కేటాయింపులు కూడా జరిగినట్లు పరిటాల సునీత వివరించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పూర్తిగా వదిలేశారన్నారు. పైగా పుట్టకనుమ రిజర్వాయర్‌ను రద్దు చేసి ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లను తీసుకొచ్చారన్నారు. పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్లు నిర్మించి పేరూరుకు నీరందిస్తామని తాము ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లు వివరించారు. వెంటనే ఈ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

పేరూరు ప్రాజెక్టుకు నిధులివ్వండి

పేరూరు ప్రాజెక్టు నిర్వహణకు నిధులు కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి, జలవనరుల శాఖమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ఐదేళ్లల్లో పేరూరు ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేక అధ్వాన స్థితికి చేరుకుందన్నారు. జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టును పరిశీలించి మరమ్మతులకు రూ. 1.26 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారన్నారు. 5, 8 గేట్లు పూర్తిగా విరిగిపోయాయన్నారు. రామగిరి మండలం నసనకోటలో ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను ఇంటర్మీడియట్‌ వరకూ ఉన్నతీకరించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, ఆ శాఖ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. అన్ని అంశాలు పరిశీలించి వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌కు అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Updated Date - Jul 23 , 2024 | 11:51 PM