Share News

పోర్టులకు రూ.3,300 కోట్లతో ప్రతిపాదనలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:22 AM

ఏపీలో భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధికి ప్రధాన మంత్రి గతిశక్తి కింద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సాయం కోరిందని,

పోర్టులకు రూ.3,300 కోట్లతో ప్రతిపాదనలు

ఏపీ ప్రత్యేక సాయం కోరింది.. లోక్‌సభలో కేంద్రం

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఏపీలో భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధికి ప్రధాన మంత్రి గతిశక్తి కింద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సాయం కోరిందని, ఈ మేరకు రూ.3,300 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ వెల్లడించారు. కొత్త జెట్టీలు, హార్బర్ల నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపించామన్నారు. లోక్‌సభలో శుక్రవారం ఎంపీ కృష్ణప్రసాద్‌ ఏపీ పోర్టుల అభివృద్ధి గురించి ప్రశ్నించగా మంత్రి ఇలా స్పందించారు.

Updated Date - Jul 27 , 2024 | 06:57 AM