ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన వేగవంతం చేయండి
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:53 PM
ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన వేగవంతం చేయా లని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారు లను ఆదేశించారు.
తంబళ్లపల్లె, సెప్టెంబరు 26: ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన వేగవంతం చేయా లని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారు లను ఆదేశించారు. తంబళ్లపల్లె తహ సీల్దారు కార్యాలయాన్ని కలెక్టర్ శ్రీధర్ చామకూరి గురువారం తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన ప్రగతిపై వీఆర్వోలు, సర్వేయర్లతో కార్యాలయంలో సమీక్షించారు. పీజీఆర్ఎస్లో భూమి సమస్యలపై వచ్చిన దరఖాస్తులు, ఎస్ఎల్ఏ పరిధిలో ఉన్నవి ఎన్ని..వాటి సమస్యలు, అందుకు తీసుకున్న చర్యలు తదితర వివరాలను అడిగి తెలుసు కుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 85 శాతం ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన పూర్తి చేశామని తహసీల్దారు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దారు హరికుమార్, ఎంపీడీవో సురేంద్రనాథ్, ఎంఈ వో త్యాగరాజు, ఏపీవో అంజినప్ప, ఏపీఎం గంగాధర్, సీడీపీవో నాగవేణి, ఆర్‌డబ్య్లూఎస్, విద్యుత, హౌసింగ్ ఏఈలు అశోక్, శేషు, సుజాత, ఈవోఆర్డీ దిలీప్‌కుమార్, ఏవో ఆనంద్, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను పటిష్టంగా నిర్వహించాలి
అంగన్వాడీ కేంద్రాలను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి సూచించారు. తంబళ్లపల్లె అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు, ఆయాలు ఎంతమంది ఉన్నారు.? చిన్నారుల సంఖ్య.? సరఫరా అవుతున్న గుడ్లు తదితర వివరాలను అడిగి తెలుసుకు న్నారు. కేంద్రం పరిధిలో రక్త హీనత కలిగిన మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఆయన సూచించారు.