Share News

AP Assembly: టీడీపీ ఎమ్మెల్యేలంతా పసుపు చొక్కాలతో రండి!

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:26 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఉదయం 9:46 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో..

AP Assembly: టీడీపీ ఎమ్మెల్యేలంతా పసుపు చొక్కాలతో రండి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఉదయం 9:46 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో తొలిరోజు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా.. ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి టీడీపీ ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీకి పయనం కానున్నారు. అయితే.. టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉదయం 9 గంటలకల్లా పసుపు చొక్కాలతో రావాలని హైకమాండ్ సూచించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ సమాచారం అందజేయడం జరిగింది. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడ్నుంచీ నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.


TDP-LEaders.jpg

ఎవరెప్పుడు ప్రమాణం..!

శుక్రవారం నాడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేస్తారు. అసెంబ్లీలో మొదట సీఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు, మహిళా సభ్యులు సాధారణ సభ్యుల ప్రమాణం చేయనున్నారు. సాధారణ సభ్యుల ప్రమాణం పేరులో మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ప్రమాణం ఉంటుంది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సాధారణ సభ్యుడిగా మాత్రమే ప్రమాణం చేయనున్నారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. సాధారణ సభ్యుడిగా మాత్రమే ప్రమాణం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. సీటింగ్ లేని కారణంగా కుటుంబ సభ్యులకు, సందర్శకులకు పాస్‌లు లేవని అసెంబ్లీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంటే.. పాస్‌లు ఇవ్వకపోవడంతో పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరూ ఉండటానికి వీల్లేదన్న మాట. మరోవైపు.. ఈ నెల 24న సీఎంచంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.

TDP-LEaders-3.jpg

Updated Date - Jun 20 , 2024 | 11:26 PM