Share News

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:07 AM

శాసనసభలో 2024-25 వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు.

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో 2024-25 వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విష్ణుకుమార్‌ రాజు బలపరిచారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో భారీగా నిధులు దారి మళ్లించారన్నారు. జగన్‌ జల్సాలు, టోకరాలంటూ రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేశారని విమర్శించారు. ఇంకా రాబోయే ఐదు టర్మ్‌ల కాలానికి మొత్తం తాకట్టు పెట్టాలని ప్రయత్నించారని, అప్పట్లో తాము గవర్నర్‌ ద్వారా కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఆగిపోయిందన్నారు. అసెంబ్లీ ఆమోదం లేకుండానే రూ.600 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 04:09 AM