Share News

కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 11 , 2024 | 12:03 AM

కాంట్రాక్టు నర్సులుగా గత పదకొండేళ్లుగా పనిచేస్తున్న తమ సమస్యలు తక్షణం పరి ష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 10: కాంట్రాక్టు నర్సులుగా గత పదకొండేళ్లుగా పనిచేస్తున్న తమ సమస్యలు తక్షణం పరి ష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జీవో నెంబర్‌ 115తో అన్యాయం జరుగుతోం దని, వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులు ధర్నా నిర్వహించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ సర్వజన బోధనాసత్రి ఎదుట కాంట్రాక్టు నర్సులు నిరసన తెలిపి మాట్లాడుతూ 11 ఏళ్లుగా రెగ్యులర్‌ నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. అప్పటి నుంచి కాంట్రాక్టు పద్ధతిలోనే పనిచేస్తున్నామన్నారు. మూడు రోజుల క్రితం విడుదల చేసిన జీవో ప్రకారం ఏఎనఎం పోస్టులను సృష్టించి వారికి రెగ్యులర్‌ పోస్టులు ఇస్తున్నారని, దీని వలన తమ ఉద్యోగాలకు భద్రత ఉండదన్నారు. ప్రభుత్వం పునరాలోచించి, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సులు సుహాసిని, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 12:03 AM