Share News

R Ashwin: రిటైర్మెంట్ ఆలోచనలపై క్లారిటీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్

ABN , Publish Date - Sep 15 , 2024 | 05:12 PM

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. 37 ఏళ్ల వయసున్న అతడు భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే నంబర్ 1 స్థానంలో ఉన్నాడు.

R Ashwin: రిటైర్మెంట్ ఆలోచనలపై క్లారిటీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్‌ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. 37 ఏళ్ల ఈ దిగ్గజ క్రికెటర్ భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కాగా బంగ్లాదేశ్‌లో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు రిటైర్మెంట్ ప్రణాళికలపై ప్రశ్నించగా అశ్విన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ఆటపై ప్రేమను కోల్పోయిన రోజు తాను వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశాడు.


‘‘ మనసులో రిటైర్మెంట్ ఆలోచనలు ఏమీ లేవు. ఆ రోజు ఎప్పుడా అని మాత్రమే నేను ఎదురుచూస్తు్న్నాను. ఎందుకంటే వయసు పెరుగుతున్నా కొద్ది ప్రతిరోజూ అదనంగా కష్టపడుతూ ఉండాలి. గత 3-4 ఏళ్లుగా నేను చాలా కష్టపడుతున్నారు. రిటైర్మెంట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ రోజు నేను మెరుగుపడలేనని అనుకున్న రోజు రిటైర్మెంట్ ప్రకటన ఉంటుంది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 40 ఏళ్ల వరకు ఆడగలరా? అని ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చాడు.


‘‘ నా కోసం నేడు ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. నేను అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ నేను రోజురోజుకు సంతోషంగా జీవిస్తున్నాను. లక్ష్యాలను నిర్దేశించుకొని ఆటపై ప్రేమను కోల్పోవాలని నేను కోరుకోవడం లేదు’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇక కెరీర్‌లో 2018-2020 మధ్య అత్యంత సంక్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నానని చెప్పాడు. గాయాలు, ఫామ్ భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేశాయని, అయితే మళ్లీ ఇప్పుడు అశ్విన్ ఆనందంగా ఉన్నానంటూ అశ్విన్ చెప్పాడు. ‘‘ ఆ క్లిష్ట దశ తర్వాత నా జీవితం ఎలా మారిందో నాకు తెలుసు. క్రికెట్‌లో నా ఆనందాన్ని అట్టిపెట్టుకొని ఉన్నాను. ఆ సంతోషాన్ని కోల్పోతున్నానని భావించిన క్షణం నేను దూరంగా ఉంటాను’’ అని వివరించాడు.

Updated Date - Sep 15 , 2024 | 05:14 PM