Two children... after swimming : ఈతకెళ్లి ఇద్దరు పిల్లలు మృతి
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:24 PM
స్థానిక విజయ్ సినిమా హాల్ సమీప కేసీ కెనాల్లో ఈతకు వెళ్లిన షేక్ యాసిన్(9),షేక్ రఫీ (9) గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.
మైదుకూరు రూరల్, అక్టోబరు 1: స్థానిక విజయ్ సినిమా హాల్ సమీప కేసీ కెనాల్లో ఈతకు వెళ్లిన షేక్ యాసిన్(9),షేక్ రఫీ (9) గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. మంగళవారం సా యంత్రం కాల్వలో ఈతకు వెళ్లిన పిల్లలు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి కేసీ కెనాల్లో వెదికారు. రాత్రి తొమ్మిది గంటలకు యాసిన్ మృత దేహం లభ్యమైంది. రఫీ కోసం అధికా రులు గాలిస్తున్నారు. వివరాల్లోకెళితే శాంతినగర్ వాసులు షేక్ మత్తున్, షేక్ కోఫిమా ఐదో సంతానం షేక్ యాసిన్, షేక్ మాలిక్, హూసేన్ మూడో కుమారుడు షేక్ రఫీ ఆర్సీఎం స్కూల్లో నాల్గోవ తరగతి చదు వుతున్నారు. ఇద్దరూ కలిసి ఇంటి వద్దే ఆడుకుంటూ పక్కనే ఉన్న కేసీ కెనాల్లో ఈత కొట్టడానికి వెళ్లారు. పనికెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రుల కు పిల్లలు కనిపించకపోవడంతో విచారించగా ఈతకు వెళ్లినట్లు తెలిపా రు. పిల్లలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీ సులు రాత్రి పొద్దు పోయే వరకూ గాలించగా ఒకరి మృతదేహం దొరికిం ది. మరొక చిన్నారి మృతదేహం దొరకాల్సివుంది.