Share News

ఎన్నికల విధులకు వెళుతూ ఇద్దరు మృతి

ABN , Publish Date - May 13 , 2024 | 04:24 AM

ఎన్నికల విధుల కోసం ఊరుగాని ఊరొచ్చిన తల్లీకొడుకును రైలు రూపంలో వచ్చిన మృత్యువు పొట్టనపెట్టుకుంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం పట్టాలు దాటుతున్న తల్లీకొడుకును రైలు వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు

ఎన్నికల విధులకు వెళుతూ ఇద్దరు మృతి

పట్టాలు దాటుతున్న తల్లీకొడుకును ఢీ కొన్న రైలు

కావలి రూరల్‌, మే 12: ఎన్నికల విధుల కోసం ఊరుగాని ఊరొచ్చిన తల్లీకొడుకును రైలు రూపంలో వచ్చిన మృత్యువు పొట్టనపెట్టుకుంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం పట్టాలు దాటుతున్న తల్లీకొడుకును రైలు వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు.

సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ సుభాషిణి (58)కి కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు. వయోభారంతోపాటు అనారోగ్యం కారణంగా తోడు కోసం ఆమె కుమారుడు వలంటీరుగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ (26)ను వెంటబెట్టుకుని వచ్చింది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రె్‌సలో నెల్లూరు నుంచి కావలి చేరుకున్నారు.

మూడో నంబర్‌ ప్లాట్‌ఫారం నుంచి రెండో ప్లాట్‌ఫారానికి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా హౌరా నుంచి బెంగళూరు వెళుతున్న దురంతో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ తల్లీకొడుకును ఢీకొనగా... వారి శరీర భాగాలు ఎగిరి పట్టాలపై చెల్లాచెదరుగా పడ్డాయి.

Updated Date - May 13 , 2024 | 04:27 AM