Share News

Visakhapatnam : బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:36 AM

కోస్తా పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

Visakhapatnam : బంగాళాఖాతంలో అల్పపీడనం

  • ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన.. మధ్య కోస్తాలో ఒక మాదిరి

విశాఖపట్నం సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కోస్తా పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తరంగా పయనించే క్రమంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కోస్తా, సీమల్లో అనేకచోట్ల వర్షాలు, శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, మధ్య కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.

Updated Date - Sep 06 , 2024 | 07:06 AM