Share News

WhatsApp Governance: వాట్సాప్‌ గవర్నెన్స్‌ దేశంలోనే తొలిసారి

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:16 AM

దేశంలో నే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ సేవ లు అందిస్తున్నామని, ఇది యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

WhatsApp Governance: వాట్సాప్‌ గవర్నెన్స్‌ దేశంలోనే తొలిసారి

ఇది యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలి.. కొత్త టెక్నాలజీలో సమస్యలు సహజం

వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలి.. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు

వాట్సాప్‌ ద్వారా 153 రకాల సేవలు: లోకేశ్‌

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): దేశంలో నే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ సేవ లు అందిస్తున్నామని, ఇది యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి సచివాలయంలో బుధవారం మొదలైన కలెక్టర్ల సదస్సులో వాట్సాప్‌ గవర్నెన్స్‌పై సీఎం మాట్లాడారు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయని, వాటిని పరిష్కరించుకుం టూ ముందుకు సాగాలన్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేశ్‌కుమార్‌ ప్రజంటేష న్‌ ఇచ్చారు. స్మార్ట్‌ గవర్నెన్స్‌లో భాగంగా గత అక్టోబరు 22న ‘మెటా’తో ఒప్పందం చేసుకున్నామని, తొలిదశలో 100 నుంచి 150 రకాల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని వివరించారు. వాట్స్‌పలో పంపిన సమస్యలను వర్చువల్‌ విధానంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టామన్నారు. కులం, ఆదాయం, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్ల జారీ వంటి అనేక రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా అందించవచ్చన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ... వాట్సాప్‌ ద్వారా ఇచ్చే డాక్యుమెంట్ల కు లీగల్‌ వ్యాలిడిటీ ఉండాలని, సైబర్‌ సెక్యూరిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికారిక వాట్సాప్‌ నంబరు ద్వారా క్యూఆర్‌ కోడ్‌తో సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరుపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌ కుమార్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Updated Date - Dec 12 , 2024 | 04:16 AM