ABN Effect: ఆంధ్రజ్యోతి దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం
ABN , Publish Date - May 03 , 2024 | 01:54 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని ఈ వైయస్ జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తాజాగా రుజువులతో సహా బహిర్గతం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం ఆగమేఘాల మీద దిగిచ్చింది. అందుకు సంబంధించిన సీడీఎంఏ వెబ్‌సైట్‌ని చాలా సైలెంట్‌గా మూసివేసింది.
అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని ఈ వైయస్ జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తాజాగా రుజువులతో సహా బహిర్గతం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం ఆగమేఘాల మీద దిగిచ్చింది. అందుకు సంబంధించిన సీడీఎంఏ వెబ్‌సైట్‌ని చాలా సైలెంట్‌గా మూసివేసింది.
TS News: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్
అయితే ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి ప్రజల డేటా చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. సంక్షేమ పథకాల వెబ్‌సైట్ల నుంచి ఆధార్, పాన్, పాస్‌పోర్ట్‌లు, ఫోన్ నెంబర్లు, ఫొటోలు, ఆస్తి పత్రాలు, ఇతర వివరాలన్నీ డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అలాగే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విభాగం నుంచి ప్రజల రహస్య సమాచారం డౌన్‌లోడ్ చేసుకొనే విధంగా ఈ జగన్ ప్రభుత్వం రూపకల్పన చేసింది.
దీంతో ప్రజలకు సంబంధించిన సమాచరం.. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో ప్రజల వ్యక్తిగత సమాచారం దుండగుల చేతిలో పడి దుర్వినియోగమయ్యే అవకాశం అధికంగా ఉంది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల అధినేతలు పలు వేదికల మీద నుంచి వివిధ సందర్భాల్లో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ స్పష్టం చేశాయి. అయితే తాజాగా ఇదే విషయాన్ని ఏబీఎన్ డిజిటల్ లైవ్‌లో బహిర్గతం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం కదిలి వచ్చింది.
AP Elections: వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు
ఆ క్రమంలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తున్న పలు వెబ్‌సైట్లలోని సీడీఎంఏని సైలెంట్‌గా ఆపేసింది. మరోవైపు ఇదే అంశాన్ని నంద్యాలకు చెందిన వైసీపీ కార్యకర్త విష్ణువర్ధన్‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. వైసీపీతో తనకు 13 ఏళ్ల అనుబంధముందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే ఆ ప్రభుత్వం అవలంభించిన వైఖరి వల్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం ఎలా దుర్వినియోగం అవుతుందో.. ఏబీఎన్ డిజిటల్ లైవ్‌లో విష్ణువర్థన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు.
State Govt: మహిళలకు మరో బంపర్ ఆఫర్.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?
ఇంకోవైపు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగిందంటూ ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ నానా యాగీ చేశారని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలోనే ఈ తరహా డేటా చోరి జరుగుతుంటే.. ఆ ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ కార్యకర్త విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Read Latest National News And Telugu News