Share News

YS Jagan:‘భద్రత’ కోసం ఇంత చేశారా..?

ABN , Publish Date - Jun 24 , 2024 | 07:44 PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. గతంలో అధికారంలో ఉండగా ఆయన తన భద్రత కోసం తీసుకున్న చర్యలపై ప్రస్తుతం సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ ముఖ్యమంత్రిగా ఆయన అసాధారణ రీతిలో తన భద్రత కోసం చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

YS Jagan:‘భద్రత’ కోసం ఇంత చేశారా..?

అమరావతి, జూన్ 24: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. గతంలో అధికారంలో ఉండగా ఆయన తన భద్రత కోసం తీసుకున్న చర్యలపై ప్రస్తుతం సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ ముఖ్యమంత్రిగా ఆయన అసాధారణ రీతిలో తన భద్రత కోసం చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి మించిన సెక్యూరిటీని సీఎంగా వైయస్ జగన్ తన కోసం ఏర్పాటు చేసుకున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైయస్ జగన్‌కు కళ్లు చెదిరే ప్యాలెస్‌లున్నాయి. వాటి వద్ద వందలాది మందితో భద్రతా వలయంగా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో దేశంలో మారే ఇతర ముఖ్యమంత్రికి లేని స్థాయిలో వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సైతం ఆయన నియమించుకున్నారు. దేశం, రాష్ట్రంలో ఉన్నప్పుడే కాదు.. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు సైతం తనకు భద్రత కల్పించేలా సీఎం జగన్ అసాధారణ రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.

Also Read:JP Nadda: ‘కళ్లకురిచ్చి’పై మౌనం ఎందుకు?


ప్యాలస్‌ల వద్ద 986 మందితో నిరంతర భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్రమంలో తాడేపల్లి ప్యాలస్ వద్ద స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి 379 మంది, ఇతర విభాగాల నుంచి 439 మందితోపాటు అలైడ్ విధుల కోసం మరో 116 మందితో కలిపి మొత్తంగా 934 మందితో సీఎంగా వైయస్ జగన్.. తన భద్రత కోసం సిబ్బందిని కేటాయించుకున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ప్యాలస్ వద్ద 9 మంది, ఇడుపులపాయలోని ప్యాలస్ వద్ద 33 మంది, పులివెందుల్లోని తన నివాసం వద్ద 10 మందితో పోలీసు భద్రతను వైయస్ జగన్ ఏర్పాటు చేసుకున్నారు.

ఇక ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ కార్యాలయమున్న తాడేపల్లి ప్యాలస్ పరిసరాల్లో కనీవిని ఎరుగని రీతిలో.. అంటే 48 చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు, పోలీస్ పికెట్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక 439 మందితో ప్యాలస్ నలుమూలల అడుగుకో పోలీస్ పోస్ట్, చెక్ పోస్ట్, బూమ్ బారియర్లతో నాటి సీఎం వైయస్ జగన్ తన భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏకంగా 15 కంపెనీలు, 2 బెటాలియన్లకు సరితూగే సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారు.

Also Read: Robert Vadra: రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు


ఆక్టోపస్ కమాండోస్‌తో తనకు ప్యాలస్‌కు సీఎం వైయస్ జగన్ భద్రత కల్పించుకున్నారు. బూమ్ బారియర్స్, టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్, రెట్రాక్టబుల్ గేట్స్ సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్నారు. సీఎంగా వైయస్ జగన్.. తన భద్రత కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని నివాసాలపై డ్రోన్లతో పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే నివాస ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయకూడదు అనే నిబంధనలు సైతం ఈ సందర్భంగా తుంగలోకి తొక్కారు. 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్న తాడేపల్లి ప్యాలస్‌కు ఇద్దరు డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

Also Read: Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!

తనకి, తన కుటుంబ సభ్యులకు ప్రాక్సిమిటీ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా 379 మందితో ప్రత్యేక బృందాన్ని సీఎం వైయస్ జగన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఎన్నికల్లో అధికారాన్ని కూటమికి కట్టబెట్టారు. దీంతో వైయస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అయినా తర్వాత కూడా.. ఆయన కాన్వాయ్‌లో కానీ, వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో కానీ ఈ కూటమి ప్రభుత్వం మార్పు చేయక పోవడం గమనార్హం. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉంది. అలాంటి ఆయన సైతం ఏనాడు ఈ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసుకోలేదని ఓ చర్చ అయితే పోలీస్ వర్గాలు కొనసాగుతుంది.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 07:55 PM