Share News

YS Sharmila : విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపం

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:54 AM

నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా డెలా ్టకు జలాలు వస్తున్నాయని ఆనందించేలోగా విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపంగా మారిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

YS Sharmila : విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపం

4 లక్షల మంది నారు వేసుకోలేకపోయారు: షర్మిల

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా డెలా ్టకు జలాలు వస్తున్నాయని ఆనందించేలోగా విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపంగా మారిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. విత్తనాల కొరత కారణంగా నాలుగు లక్షల మంది రైతులు నారు వేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్‌కు తగినట్టుగా విత్తనాలు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘క్రాప్‌ హాలీడే నుంచి బీడు భూములను సాగులోకి తెద్దామన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. రైతులకు నచ్చినవి కాకుండా సర్కారుకు నచ్చిన విత్తనాలు కొనుగోలు చేయాలనడం ఏమిటి? మహిళలని కూడా చూడకుండా విత్తనాల కోసం వర్షంలో నిలబెడతారా? తొక్కిసలాట జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తారా?’ అని ఆమె నిలదీశారు. 48 గంటల్లోగా 15 క్వింటాళ్ల జేజీఎల్‌ 384 రకం విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 09 , 2024 | 04:54 AM