Share News

AP Elections: కంటతడి పెట్టిన షర్మిల

ABN , Publish Date - May 10 , 2024 | 08:42 PM

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తాను అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తన సోదరుడు, సీఎం వైయస్ జగన్‌ను ఆమె డిమాండ్ చేశారు.

AP Elections: కంటతడి పెట్టిన షర్మిల

కడప, మే 10: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తాను అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తన సోదరుడు, సీఎం వైయస్ జగన్‌ను ఆమె డిమాండ్ చేశారు. తాను రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారన్నారు.

Money Laundering Case : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. స్పందించిన సునీత

తనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది ఈ జగనే కాదా? అని గుర్తు చేశారు. మీరు జైల్లో ఉన్నప్పుడు తనను పాదయాత్ర చేయమంది మీరు కాదా? అని జగన్‌ను ఈ సందర్బంగా నిలదీశారు. తన భర్త, పిల్లలను వదిలేసి.. వేలాది కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశానని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మీ భవిష్యత్తు కోసం.. తన కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదని తెలిపారు. పాదయాత్ర సమయంలో వైసీపీ అంతా తన చుట్టునే తిరిగిందని పేర్కొన్నారు.


జగన్ చెబుతున్నట్లు తనకే రాజకీయ కాంక్ష ఉంటే.. వైసీపీని అప్పుడే హైజాక్ చేసేదానినని షర్మిల చెప్పారు. మీ నుంచి పైసా సాయం అశించినట్లు మీరు నిరూపించగలరా? అంటూ వైయస్ జగన్‌కు ఆమె సూటిగా సవాల్ విసిరారు. అయినా మీరు వైయస్ఆర్ కొడుకునని మరిచిపోతున్నారన్నారు.

LokSabha Elections: చెత్త కుప్పలో ఓటరు ఐడీలు.. విచారణకు ఆదేశం

ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్నవాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారని ఈ సందర్భంగా వైయస్ షర్మిల గుర్తు చేశారు. అదే విధంగా వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నవారు చాలా మంది ఉన్నారని వివరించారు. అయితే ఎన్నికల వేళ.. సీఎం వైయస్ జగన్ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సోదరి వైయస్ షర్మిలపై విమర్శలు, ఆరోపణలు సంధించారు. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 10 , 2024 | 08:50 PM