Share News

BIG DEBATE: వైయస్ భారతికి ఫోన్ చేస్తే.. ఏం చేసిందంటే..

ABN , Publish Date - May 06 , 2024 | 08:56 PM

తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు.

BIG DEBATE: వైయస్ భారతికి ఫోన్ చేస్తే.. ఏం చేసిందంటే..

హైదరాబాద్, మే 06: తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన బిగ్ డిబేట్‌లో సునీత నర్రెడ్డితోపాటు ఆమె భర్త రాజశేఖరరెడ్డి నర్రెడ్డి పాల్గొన్నారు.

Delhi Lieutenant Governor: కేజ్రీవాల్‌కు మళ్లీ గట్టి దెబ్బ

ఈ సందర్బంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు సునీత నర్రెడ్డి దంపతులు సమాధానమిచ్చారు. ఈ రోజే వివేకా మృతదేహానికి అంత్యక్రియలు చేసేద్దామా? అంటూ పులివెందుల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ తనకు వచ్చాయని చెప్పారు.


ఈ నేపథ్యంలో వైయస్ జగన్ భార్య వైయస్ భారతీకి ఫోన్ చేశాను... అంటే వైయస్ భారతీ పీఏ నవీన్‌కు ఫోన్ చేసి.. భారతీతో మాట్లాడాలని.. అతడికి చెప్పానని సునీత తెలిపారు. ఆ వెంటనే భారతీకి తాను ఫోన్ చేసి.. జగనన్నతో మాట్లాడాలని అని ఆమెతో చెప్పానన్నారు.

Delhi Liquor Case: కవితకు బెయిల్ నిరాకరణ.. వైయస్ జగన్ పేరు ప్రస్తావించిన కోర్టు

దీంతో ఆమె ఫోన్ వైయస్ జగన్‌కు ఇచ్చిందిని సునీత నర్రెడ్డి పేర్కొన్కారు. దాంతో తన తండ్రి అంత్యక్రియలు విషయం వైయస్ జగన్‌తో మాట్లాడితే.. నీవు ఎలా చేద్దామంటే.. అలా చేద్దామని తనతో అన్నారనన్నారు.

Narendra Modi: చంద్రబాబు పాలనలోనే ఏపీ నెంబర్ వన్

అయితే తన తండ్రి హత్యకు గురయ్యారని తెలిసినా.. ఈ విషయాన్ని ఆ సమయంలో వైయస్ జగన్‌తో ఎందుకు ప్రస్తావించలేని ఆర్కే ప్రశ్నిస్తే.. కుటుంబానికి ఇక పెద్ద దిక్కు వైయస్ జగన్ అని భావించానని ఈ సందర్భంగా సునీత స్ఫష్టం చేశారు. ఇక ఏమున్నా.. ఆయనే చూసుకుంటాడని ఆ సమయంలో భావించానని తెలిపారు. దీంతో తన తండ్రి వివేకా హత్యను సోదరుడు వైయస్ జగన్ వద్ద ప్రస్తావించలేదని సునీత నర్రెడ్డి వెల్లడించారు.

Read Latest National News And Telugu news

Updated Date - May 06 , 2024 | 08:56 PM