Home » sunitha
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి గత రెండు రోజుల షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధమవడం ఏంటి.. ఆల్రెడీ కొందరు ముఖ్య నేతలు పార్టీలు వీడగా..
ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు. ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఈ నియంతృత్వం.. జైల్లో అయితే ఉంచగలిగింది. కానీ హృదయంలో దేశభక్తిని అది ఎలా కలిగి ఉంటుందన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సునీత కేజ్రీవాల్ స్పందించారు.
న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ.. న్యాయం తిరస్కరించబడడం మాత్రం జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పైవిధంగా స్పందించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్లుగా ఈడీ వ్యవహరశైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కన్నతల్లి వైయస్ విజయమ్మ ముందే ఊహంచారా? అంటే ఆమె ముందే ఊహించి ఉండ వచ్చునని ఉమ్మడి కడప జిల్లా వాసులు తాజాగా అభిప్రాయ పడుతున్నారు.
సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ వివేకా హాత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ కూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే వైయస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.
మద్యం కేసు.. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కేజ్రీవాల్ భార్య సునీత ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు.
తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు.
కడప: సీఎం జగన్ సొంత అడ్డా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వివేక కుమార్తె సునీత అక్క కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆమెకు జనం నీరాజనం పలుకుతున్నారు.