Delhi excise policy scam: మనీశ్ సిసోడియాకు బెయిల్.. స్పందించిన సునీత కేజ్రీవాల్
ABN , Publish Date - Aug 09 , 2024 | 01:46 PM
న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ.. న్యాయం తిరస్కరించబడడం మాత్రం జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పైవిధంగా స్పందించారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 09: న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ.. న్యాయం తిరస్కరించబడడం మాత్రం జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పైవిధంగా స్పందించారు.
Also Read: wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?
ఆప్ కార్యాలయాల్లో సందడి...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. నాటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ క్రమంలో పలుమార్లు బెయిల్ పిటిషన్ వివిధ కోర్టుల్లో దాఖలు చేసినా.. ఆయనకు బెయిల్ మాత్రం లభించలేదు. దాదాపు 18 నెలల అనంతరం మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో.. ఆప్ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.
Also Read: Bangladesh Violance: బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన 7,200 మంది భారతీయ విద్యార్థులు
ఆప్ నేతలు స్పందన..
మనీశ్‌కు బెయిల్ రావడంపై ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా స్పందించారు. ఢిల్లీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిన హీరో మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడం దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతుందన్నారు. అలాగే ఆప్‌లోని పలువురు అగ్రనేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Also Read: Gujarat Model: చికాగోలో టీచర్ గారు.. జీతం మాత్రం గుజరాత్‌లో..
ఘాటుగా స్పందించిన బీజేపీ..
అయితే ఆప్ చేస్తున్న సందడిపై బీజేపీ కాస్తా ఘాటుగా స్పందించింది. మద్యం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని బీజేపీ స్వాగతించింది. కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎల్లప్పుడు స్వాగతిస్తుందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే మనీశ్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
అంతేకానీ.. ఈ కేసు నుంచి ఆయన పూర్తిగా విముక్తి పొందలేదని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులు ఎవరైనా సరే.. మధ్యవర్తిత్వం వహించారని గుర్తు చేశారు. ఎవరు ఏమిటన్నది ప్రజా కోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు.
Also Read: Odisha: విద్యార్థులకు అస్వస్థత.. దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఏర్పాటు
అలాగే ఈ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్.. నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఆగస్ట్ 20 వరకు పోడిగించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియాకు జస్టిస్ గవాయ్, కె.వి. విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విధితమే.
Also Read: Independence Day 2024: ఆగస్ట్ 15 వేళ.. బీజేపీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం
Read More National News and Latest Telugu News