Share News

Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!

ABN , Publish Date - Sep 05 , 2024 | 07:21 AM

మౌలిక ఆర్థిక సూత్రాలను కచ్చితంగా అమలు చేస్తే మధ్యతరగతి వారు కూడా సంపన్నులు కావచ్చు. ఆర్థిక భద్రత, ప్రశాంతతను పొందొచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కొంటున్న వర్గాల్లో మిడిల్ క్లాస్ వాళ్లు ముందుంటున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, కొన్ని మౌలిక ఆర్థిక సూత్రాలను కచ్చితంగా అమలు చేస్తే మధ్యతరగతి వారు కూడా సంపన్నులు కావచ్చు. ఆర్థిక భద్రత, ప్రశాంతతను పొందొచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Personal Finance)).


ఆదాయానికి లోబడి జీవించాలి

ఖర్చులు ఆదాయానికి లోబడే ఉండాలి. అట్టహాసం, ఆడంబరాలు ఎక్కువైపోతున్న నేటి జమానాలో తెలీకుండానే అప్పులు చేసి మరీ శక్తికి మించి ఖర్చుపెట్టేవారు కోకొల్లలు. ఈ విష సంస్కృతి నుంచి బయటకు రావాలంటే ముందుగా ఇష్టాలను పక్కనపెట్టి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతో, ఖర్చులు అవే దిగొస్తాయి.

కెరీర్‌పై దృష్టి

ప్రతి వ్యక్తి జీవితంలో తమ కెరీర్‌కు మించిన ఆస్తి లేదు. కాబట్టి, వృత్తిజీవితంలో ముందుకెళ్లేందుకు ప్రయత్నించాలి. కొత్త నైపుణ్యాలతో ప్రమోషన్లు పొందుతూ జీతనాతాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైతే కొత్త అవకాశాల వైపు మళ్లాలి.

అత్యవసర నిధి

జీవితంలో అనుకోని ఇబ్బందులు రావడం సహజం. ఈ పరిస్థితుల్లో ఖర్చుల కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. నెల నెలా చిన్న మొత్తాలైనా సరే ఎమర్జెన్సీ సందర్భాల కోసం పొదుపు చేస్తూ చూస్తూ ఉండగానే మంచి మొత్తం జమవుతుంది. కష్టసమయాల్లో అండగా నిలుస్తుంది.

Personal Finance: ఇలా చేస్తే పదవీ విరమణ తరువాత నెలకు రూ.1.5 లక్షల పెన్షన్!

పన్నులు తక్కువగా ఉండే పెట్టుబడి సాధనాలలో డబ్బును మళ్లిస్తే మంచి రాబడులను కళ్లచూడొచ్చు. సంపదను సృష్టించుకోవచ్చు


ఆర్థిక విజయానికి దీర్ఘకాలిక పెట్టుబడులు కీలకం. చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడులగా పెడితే రెండు మూడు దశాబ్దాల్లో బోలెడంత సొమ్ము సొంతమవుతుంది.

సొంతిల్లు కూడా ఆర్థిక భద్రతకు కీలకం. కాబట్టి, ఆర్థిక వనరులకు అందుబాటులో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి. ఇల్లు కొనుగోలు చేశాక దాన్ని జాగ్రత్తగా మెయిన్‌టెన్ చేస్తే అమ్మకానికి పెట్టినప్పుడు మంచి ధర కూడా వస్తుంది.

అప్పులు కూడా మంచివే..

అనవసర అప్పులతో చేటు తప్పదు కానీ రాబడి మార్గాలను పెంచే అప్పులు భవిష్యత్తులో మేలు చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు స్థిరాస్తుల కొనుగోలు, చదువులు, వంటివాటికి కోసం అప్పులు చేసినా భవిష్యత్తులో ఇవి సంపద సృష్టికి దారి తీస్తాయి.

నిరంతర అధ్యయనం..

ఆర్థికాంశాలపై అవగాహన పెంచుకోవడం కూడా సంపద సృష్టికి కీలకం. పెట్టుబడులు, మార్కెట్ తీరుతెన్నులపై నిరంతర అధ్యయనంతో అవగాహన పెంచుకుని ఆర్థికంగా మెరుగైన స్థితిని సాధించొచ్చు

బడ్జెట్..

ఖర్చులు అదుపుదాటకుండా ఉండాలంటే ముందుగా నెలవారీ ఖర్చులకు సంబంధించి ఓ బడ్జెట్ రూపొందించుకుని దానికి కట్టుబడి ఉండాలి. దీంతో, పొదుపు చేయడం సులభమై సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుంది.

కూడబెట్టిన సంపద నీళ్లలా కరిగిపోకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, జీవితబీమా, వైకల్యం, ఆస్తుల ఇన్సూరెన్స్ వంటివన్నీ అనుకోని అవాంతరాల నుంచి గట్టెక్కేందుకు తోడ్పాటునందిస్తాయి.

కాబట్టి, ఆర్థిక ఆంశాల్లో నిత్యం అప్రమత్తంగా ఉంటే మిడిల్ క్లాస్ జీవులు ఆర్థిక భద్రత సాధించడం అంత కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు.

Read Latest and Business News

Updated Date - Sep 05 , 2024 | 07:51 AM